Taali Kattu Subhavela Song Lyrics penned by Acharya Athreya Garu, sung by SP Balu Garu, and music composed by M S Viswanathan Garu from Telugu cinema ‘అంతులేని కథ‘.
Taali Kattu Subhavela Song Credits
Anthuleni Katha Movie Released Date – 27 February 1976 | |
Director | K. Balachander |
Producer | Rama Arangannal |
Singer | S P Balasubramanyam |
Music | M.S.Viswanathan |
Lyrics | Acharya Athreya |
Star Cast | Rajinikanth, Jayaprada, Jayalakshmi, Sripriya |
Video Source |
Taali Kattu Subhavela Song Lyrics in English
Taali Kattu Subhavela
Medalo Kalyana Maala
O Ho Ho Aa Haa Haa
Uhu Hoo Ye Hey Hey
Taali Kattu Subhavela
Medalo Kalyana Maala
Enaadu Ye Jantako Raasi Unnaadu
Vidhi Eppudo
Aahaa Haa Enaadu Ye Jantako
Raasi Unnaadu Vidhi Eppudo
Taali Kattu Subhavela
Medalo Kalyana Maala
Vikatakavini Nenu… Vinandi Oka Katha Chebuthaanu
Kaakulu Doorani Kaaradavi
Andulo Kaalam Erugani Maanokati
Aa Andaala Maanulo Aa Adbutha Vanamlo
Chakkani Chilakalu Akka Chellelu
Pakkana Gorinkalu
Oka Gorinkaku O Chilakammaku
Oddhika Kudirenamma
Bava Raava Nannelukovaa
Taali Kattu Subhavela
Medalo Kalyana Maala
Enaadu Ye Jantako Raasi Unnaadu
Vidhi Eppudo
Enaadu Ye Jantako Raasi Unnaadu
Vidhi Eppudo
Melaalu Thaalaalu Mangalavaadhyaalu
Minnanti Mogenamma
Melaalu Thaalaalu Mangalavaadhyaalu
Minnanti Mogenamma
Valapu Vimaanaana Thalalupa Vegaana
Vachhaayi Kaankalamma
Singapore Airlines Announces The Arrival of flight SQ583
Ooregu Daarula Vayyaari Bhaamalu
Veenaku Meetiramma
Singaari Jaanala Mungaali Muvvalu
Ghalluna Mogenammaa
Taali Kattu Subhavela
Medalo Kalyana Maala
Gomaatha Legatho Kondantha Prematho
Deevincha Vachhenamma
Convent Pillala Polina Nemalulu
Greetings Cheppiramma
Wish You Both A Happy Life Happy Happy Married Life
Naalugu Vedhaalu Vallinchu
Harinaalu Mantraalu Chadivenamma
Naalugu Vedhaalu Vallinchu
Harinaalu Mantraalu Chadivenamma
Pattaputenugu Pachhaga Noorellu Vardhillamanenamma
Taali Kattu Subhavela Medalo Kalyana Maala
Cheyi Cheyiga Chiluka Gorinka
Shayyaku Tharaliramma
Chelleli Kosam Thyagamu Chesina
Chilukamma Tholagenamma
Thappuga Thalachina
Appati Gorinkakippudu Telisenamma
Adhi Chiluke Kaadani
Baavilo Kappani Jaaliga Thalachenamma
Taali Kattu Subhavela
Medalo Kalyana Maala
Enaadu Ye Jantako
Raasi Unnaadu Vidhi Eppudo
Taali Kattu Subhavela
Medalo Kalyana Maala
Watch తాళికట్టు శుభవేళ Video Song
Taali Kattu Subhavela Song Lyrics in Telugu
తాళికట్టు శుభవేళ
మెడలో కళ్యాణమాల
ఓ హో హో ఆ హా హా
ఉహూఁ హూఁ ఏ హే హే
తాళికట్టు శుభవేళ
మెడలో కళ్యాణమాల
ఏనాడు ఏ జంటకో
రాసి ఉన్నాడు విధి ఎప్పుడో
అహా హా, ఏనాడు ఏ జంటకో
రాసి ఉన్నాడు విధి ఎప్పుడో
తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల
వికటకవని నేను… వినండి ఒక కథ చెబుతాను
కాకులు దూరని కారడవి
అందులో కాలం ఎరుగని మానొకటి
ఆ అందాల మానులో… ఆ అద్భుత వనంలో
చక్కని చిలకలు అక్కాచెల్లెలు
పక్కన గోరింకలు
ఒక గోరింకకు ఓ చిలకమ్మకు
ఒద్దిక కుదిరెనమ్మా
బావా రావా… నన్నేలుకోవా..?
తాళికట్టు శుభవేళ
మెడలో కళ్యాణమాల
ఏనాడు ఏ జంటకో రాసి ఉన్నాడు
విధి ఎప్పుడో
ఏనాడు ఏ జంటకో రాసి ఉన్నాడు
విధి ఎప్పుడో
మేళాలు తాళాలు మంగళవాద్యాలు
మిన్నంటి మోగెనమ్మా
మేళాలు తాళాలు మంగళవాద్యాలు
మిన్నంటి మోగెనమ్మా
వలపు విమానాన తలపుల వేగాన
వచ్చాయి కాన్కలమ్మా
సింగపూర్ ఎయిర్లైన్స్ అనౌన్సస్ ద అరైవల్ ఆఫ్ ఫ్లైట్ ఎస్ క్యూ 583.
ఊరేగు దారుల వయ్యారి భామలు
వీణలు మీటిరమ్మా
సింగారి జాణల ముంగాలి మువ్వలు
ఘల్లున మోగెనమ్మా
తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల
గోమాత లేగతో కొండంత ప్రేమతో
దీవించ వచ్చెనమ్మా
కాన్వెంటు పిల్లల పోలిన నెమళులు
గ్రీటింగ్స్ చెప్పిరమ్మా
విష్ యూ బోత్ ఏ హ్యాపీ లైఫ్ హ్యాపీ హ్యాపీ మారీడ్ లైఫ్
నాలుగు వేదాలు వల్లించు హరిణాలు
మంత్రాలు చదివెనమ్మా
నాలుగు వేదాలు వల్లించు హరిణాలు
మంత్రాలు చదివెనమ్మా
పట్టపుటేనుగు పచ్చగ నూరేళ్లు వర్థిల్లమనెనమ్మా
తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల
చేయి చేయిగ చిలుక గోరింక
శయ్యకు తరలిరమ్మా
చెల్లెలి కోసం త్యాగము చేసిన
చిలుకమ్మ తొలగెనమ్మా
తప్పుగ తలచిన అప్పటి గోరింకకిప్పుడు తెలిసెనమ్మా
అది చిలుకే కాదని బావిలో కప్పని జాలిగ తలచెనమ్మా
తాళికట్టు శుభవేళ… మెడలో కళ్యాణమాల
ఏనాడు ఏ జంటకో… రాసి ఉన్నాడు విధి ఎప్పుడో
తాళికట్టు శుభవేళ… మెడలో కళ్యాణమాల