Telangana Lockdown Till 31st March – CM KCR Press Meet 22nd March 2020

1
Telangana Lockdown Till 31st March
Pic Credit: Telangana CMO (Twitter)

Telangana Lockdown Till 31st March. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా సీఎం కెసిఆర్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. మార్చి నెల 31 వరకు తెలంగాణ రాష్ట్రం మొత్తం లాక్ డౌన్ ప్రకటించారు. ఇప్పటి వరకు తెలంగాణాలో 26 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సంగీభావ సంకేతాన్ని అందరూ అద్భుతంగా పాటించారు. అలానే రోడ్ల మీదకు రాలేదు. ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు కెసిఆర్.

Telangana Lockdown Till 31st March.. ఈరోజు ప్రెస్ మీట్ వివరాలు…

  • ఎపిడెమిక్ డిసీస్ ఆక్ట్ 1897 కింద కొన్ని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
  • 31 మార్చి 2020 వరకు తెలంగాణ రాష్ట్రం మొత్తం లాక్ డౌన్ లో ఉంటది.
  • ఇల్లు దాటి బయటికి రావద్దు. 5గురికి మించి గుమికూడవద్దు. ఇద్దరు వ్యక్తుల మధ్య 3 మీటర్ల దూరంలో ఉండాలి.
  • నిత్యావసరాల కొనుగోలు కోసం కుటుంబం నుండి ఒక్కరికే బయటికి వెళ్ళడానికి అనుమతి.

పేద కుటుంబాలకు అండ

  • నిరుపేదలు ఆకలికి గురికావద్దు.
  • నెల రోజులకు సరిపోయే రేషన్ బియ్యం ఉచితంగా ఒక్కరికి 12 కిలోల చొప్పున తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి అందిజేస్తారు.
  • 87.59 లక్షల మందికి తెల్ల కార్డులు ఉన్నాయి తెలంగాణాలో, ఇందుకోసం రూ.1,103 కోట్లు వెచ్చిస్తుంది ప్రభుత్వం.
  • నిత్యావసరాల కొనుగోలుకు ప్రతీ రేషన్ కార్డుకు రూ.1,500 అందజేస్తారు. ఇందుకోసం రూ.1,314 కోట్లు ఖర్చు అవుతుంది.

ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసులకు రావాల్సిన పని లేదు

  • అందరు ప్రభుత్వ ఉద్యోగులు పనులకు రావాల్సిన పని లేదు. అత్యవసర సర్వీసులు ఉన్న వారు మాత్రమే రావాలి.
  • అత్యవసర సర్వీసుల ఉద్యోగులు 100% రావాలి. మిగతా వారు రొటేషన్ పద్దతిలో 20% మంది రావాలి.
  • పేపర్ వాల్యుయేషన్ కూడా రద్దు చేయడం జరిగింది.

కాంట్రాక్టు మరియు ఇతర ఉద్యోగులకు చేయూత

  • భావన నిర్మాణ కార్మికులు, కాంట్రాక్టు ఉద్యోగులు, కూలీ పని వారికి మరియు ఇతరత్రా ఉన్న ఉద్యోగులకు 31 మార్చి వరకు విధిగా జీతాలు చెల్లించాలి ప్రభుత్వంతో సహా.
  •  లాక్ డౌన్ కాలంలో ఆయా సంస్థల ఉద్యోగులకు ఈ వారం రోజుల సాలరీ చెల్లించాలి.

ప్రజా రవాణా వ్యవస్థ బందు

  • వంద శాతం ప్రజా రవాణా వ్యవస్థ బందు.
  • ఆర్టీసీ బస్సులు, ఆటోలు, టాక్సీలు మొదలగునవి అన్నీ నిలిపివేస్తున్నాము.
  • రోడ్ల మీదకు వీటికి అనుమతి ఉండదు.

ఇంకా ఇతర నిర్ణయాలు

  • అంగన్వాడీ కేంద్రాలు మూసివేస్తారు. వారికి కావాల్సిన న్యూట్రిషియన్ ఆహరం అందిస్తారు.
  • ప్రసవానికి సిద్ధంగా ఉన్న గర్భిణీల జాబితా తయారు చేసి వారికి సరిపోవు అమ్మఒడి వాహనాలు, ఆరోగ్య సదుపాయాలు చేకూర్చడం జరుగుతుంది.
  • ప్రజలు గుమికూడదనే ఇవన్నీ నిర్ణయాలు. సమాజమంతా ఏకమై మనల్ని మనమే కాపాడుకోవాలి.
  • అన్ని రాష్ట్రాల సరిహద్దులు మూసివేయడం జరుగుతుంది. ఒక్క వాహనాన్ని కూడా అనుమతించడం జరగదు.
  • అత్యవసర సర్వీసులు నడుస్తాయి.

Also Read: Janata Curfew KCR Press Meet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here