Home » Telugu Lyrics » Telisinda Nedu Song Lyrics – రామం రాఘవం (Ramam Raghavam)

Telisinda Nedu Song Lyrics – రామం రాఘవం (Ramam Raghavam)

by Devender

Telisinda Nedu Song Lyrics రామజోగయ్య శాస్త్రి అందించగా, శ్రీకాంత్ హరిచరణ్ పాడిన ఈ పాటకి అరుణ్ చిలువేరు సంగీతాన్ని సమకూర్చారు.

Telisinda Nedu Song Credits

MovieRamam Raghavam
DirectorDhanraj Koranani
ProducerPrudhvi Polavarapu
SingerSreekanth Hariharan
MusicianArun Chiluveru
LyricistRamajogayya Sastry
Star CastSamuthirakani, Dhanraj Koranani
Music Label & SourceMango Music

Telisinda Nedu Song Lyrics

తెలిసిందా నేడూ… గమనించి చూడూ
నిను కన్న తోడూ… విలువేంటనీ
నిశి నీడలోనూ… నిను వీడిపోనీ
ఒక నాన్న మనసూ… బరువెంతనీ

పొరపాటునా… చేజారకూ
పొరపాటున చేజారకు
మరి దొరకని… ఆ ఉనికిని
వేధించకు, బాధించకు
నిను పెంచిన ఆ ప్రేమని

తెలిసిందా నేడూ… గమనించి చూడూ
నిను కన్న తోడూ… విలువేంటనీ
విలువేంటనీ…

ఏది నీ నిధి? ఏది కానిది, తేల్చుకోలేవా
పెడదారిగా విధి
నడుపుతున్నది పోల్చుకోలేవా??

ఏది నిజమగు రాబడి
ఏమిటో నీ అలజడి
చిటికెలో సుడి తిరిగిన
చెడు తలపులే… నిను తరిమిన
మరు క్షణములో పల కలిగిన
పరితాపమే ఎద నలుపు కడిగిన
మార్పుగా… తొలి తూర్పుగా
ఆ నిన్నటిని, చీకటిని వదిలి పదవా

తెలిసిందా నేడూ… గమనించి చూడూ
నిను కన్న తోడూ… విలువేంటనీ
నిశి నీడలోనూ… నిను వీడిపోనీ
ఒక నాన్న మనసూ… బరువెంతనీ

పొరపాటునా… చేజారకూ
పొరపాటున చేజారకు
మరి దొరకని… ఆ ఉనికిని
వేధించకు, బాధించకు
నిను పెంచిన ఆ ప్రేమని

తెలిసిందా నేడూ… గమనించి చూడూ
నిను కన్న తోడూ… విలువేంటనీ
విలువేంటనీ… విలువేంటనీ

Watch తెలిసిందా నేడు Lyrical Video Song

You may also like

Leave a Comment