తెలంగాణ ఇంటర్ ఫలితాలు జూన్ 18న విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వానికి ఫలితాలకు సంబంధించి తుది నివేదిక కూడా సమర్పించారు.
రాష్ట్రంలో ఇంటర్ మొదటి మరియు రెండో సంవత్సరం ఫలితాలు రేపు (18 జూన్ 2020) గురువారం నాడు సాయంత్రం విడుదల చేయనున్నారు. మార్చి నెలలోనే ఇంటర్ బోర్డు పరీక్షలు పూర్తి చేసిన విషయం తెలిసిందే.
దాదాపు 9.65 (95.72%) లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యారు. తెలంగాణాలో 04 మార్చి 2020 నుండి 23 మార్చి వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి.
ఇదిలా ఉండగా ఫలితాల వెబ్ కాపీని వెంటనే విద్యార్థులు డౌన్లోడ్ చేసుకునే సదుపాయంతో పాటు డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి గ్రీటింగ్ మెసేజ్ ను కూడా పంపించనున్నట్టు దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. ఫలితాల మరుసటి రోజే డిగ్రీ ప్రవేశాల నోటిఫికేషన్ కూడా జారీ కానుంది.