ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ (కొవిడ్ 19) భారత్ లోకి ప్రవేశించింది. భారత్ లో రెండు కరోనా పాజిటివ్ కేసులు
నమోదు అయ్యాయి. ఇందులో ఒక కేసు హైదరాబాద్ లో మరో కేసు ఢిల్లీలో నమోదు అయినట్టు అధికారికంగా ప్రకటిస్తూ ఇద్దరి
ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది.
ఇటలీ నుండి ఢిల్లీకి వచ్చిన ఒక వ్యక్తికి కొవిడ్ 19 లక్షణాలు ఉన్నాయని, అతనిని దేశ రాజధానిలో ఉన్న ఆర్‌ఎంఎల్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దుబాయ్ నుండి హైదరాబాద్ చేరుకున్న మరో వ్యక్తికి కూడా కరోనావైరస్ లక్షణాలు ఉన్నట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన 14 రోజులు తరవాత మాత్రమే దాని ప్రభావం చూపిస్తుంది. అందుకు అనుగుణంగానే ఆరోగ్య
శాఖా అధికారులు జరిపిన పరీక్షల్లో ఈ వైరస్ లక్షణాలు ఉన్నాయని తేలింది.