Undipovachuga Song Lyrics సురేష్ బనిసెట్టి అందించారు. నిమ్శీ అందించిన సంగీతానికి రితేష్ మరియు అదితి భావరాజు పాడారు ఈ పాట.
Undipovachuga Song Lyrics Credits
Director | Vikas Pandu |
Producers | Bunnyvox |
Singers | Ritesh G Rao, Aditi Bhavaraju |
Music | Nimshi Zacchaeus |
Lyrics | Suresh Banisetti |
Star Cast | Bunnyvox, Varun Babu |
Music Label & Source | Bunny Vox (YouTube) |
Undipovachuga Song Lyrics
నీతోనే నీతోనే ఉంటానే
కలలో కూడా నిన్నే దాటిపోనే పోనే
నువ్వేలే నా ప్రాణం అంటానే
విడిచిపెట్టి ఎట్టా ఉంటానే…
ఎన్నో ఎన్నో ఆనందాలు
ఉన్నపాటుగా నాలో ఉరికే
నాకే అర్ధం నీలో దొరికే
నేను అందుకనే వచ్చా వెనకే
అమ్మో అమ్మో అమ్మో హమ్మమ్మో
అరెరే ఏదో చేసేసావమ్మో…
గుండె చప్పుడంతా గంట కొట్టెనంట
నువ్వు పక్కనుంటే అంతే అంతే
అరక్షణమైన దూరంగుంటే
నమ్ముకున్న నేనేమైపోతానే…
ఉండిపోవొచ్చుగా ఇలా…
ఉండిపోవొచ్చుగా ఇలా…
ఎప్పుడు వెంట నీడలా
నువ్విలా నువ్విలా…
చుట్టుకోవచ్చుగా ఇలా
పట్టుకోవచ్చుగా ఇలా
చెప్పలేనంత ప్రేమలా
నన్నిలా నన్నిలా…
చెట్టుమీద చల్లగాలి నన్ను తాకుతుంటే
నువ్వు తాకినట్టు ఉంది ఏంటి..?
రంగు రంగు వానవిల్లు వంపి చూడగానే
నువ్వు నవ్వినట్టు ఉంది ఏంటి..?
పావురాల గుంపులోన అల్లరంత చూస్తే
నువ్వు ఆడినట్టు ఉంది ఏంటి
వాన చుక్కలన్నీ వచ్చి మీద వాలుతుంటే
నువ్వు గిచ్చినట్టు ఉంది ఏంటి… ఏంటి
చూడవా చూడవా..?
ఎన్ని వింతనో చూడవా
ఎంత మైకమో చూడవా
పిల్ల నీ వల్లా…
వాలవా వాలవా
నాలో కొయిలై వాలవా
ప్రేమ పాటలే పాడవా
పిల్లా ఓ పిల్లా…
ఉండిపోవొచ్చుగా ఇలా…
ఉండిపోవొచ్చుగా ఇలా…
ఎప్పుడు వెంట నీడలా
నువ్విలా నువ్విలా…
చుట్టుకోవచ్చుగా ఇలా
పట్టుకోవచ్చుగా ఇలా
చెప్పలేనంత ప్రేమలా
నన్నిలా నన్నిలా…
నన్ను తప్ప ఎవరిని నువ్వు కలగన్నా
నాకు అది తెలిసిపోదా ఏంటి?
మాట వరసకైనా నువ్వు నన్ను మర్చిపోతే
నిలువునా ఒళ్ళు మండదేంటీ?
నీకు మధ్యలోకి ఎవరడ్డు వచ్చినా
నవ్వుకుంటూ సర్దుకుంటానేంటి
నువ్వు పొలమారుతుంది నా వల్ల కాదు అంటే
కంటనీరు ఆగుతుందా ఏంటి… ఏంటి
ఎన్నో ఎన్నో భావాలెన్నో
ఇన్ని నాళ్ళుగా దాచే మనసే
అన్ని అన్ని నీతో తెలిపే రోజు
ఎప్పుడని ఎదురే చూసే
అయ్యో అయ్యో అయ్యో అయ్యయ్యో
ఇంకో మాటే లేనే లేదయ్యో
గుండె చప్పుడంతా దారి తప్పుతుందే
నువ్వు కొద్దిగైనా మౌనంగుంటే
అరక్షణమైన దూరంగుంటే
నమ్ముకున్న నేనేమైపోతానో
గాలిలో కలిసిపోతానో…
నీటిలో కరిగిపోతానో…
మంటలో కాలిపోతానో
తెలియదే తెలియదే…
మట్టిలో నిదుర పోతానో
నింగికే ఎగిరి పోతానో
నువ్వు లేక ఏమవుతానో
తెలియదే తెలియదే…
Watch ఉండిపోవొచ్చుగా Video Song
ఉండిపోవొచ్చుగా ఇలా…
ఉండిపోవొచ్చుగా ఇలా…
ఎప్పుడు వెంట నీడలా
నువ్విలా నువ్విలా…
చుట్టుకోవచ్చుగా ఇలా
పట్టుకోవచ్చుగా ఇలా
చెప్పలేనంత ప్రేమలా
నన్నిలా నన్నిలా…