Varshapu Vennela Song Lyrics రాకెందు మౌళి అందించగా, అల్లన్ ప్రీతం సంగీతానికి పివీఎన్ ఎస్ రోహిత్, పల్లవి అన్నవజ్జల, రాజా గణపతి & ఐశ్వర్య రాధాకృష్ణన్ పాడారు.
Varshapu Vennela Song Lyrics Credits
Director | Chandrakanth Dutta |
Producer | Sai Aravind Sammeta |
Singers | PVNS Rohit & Pallavi Annavajjala (Telugu), Raja Ganapathy & Aishwerya Radhakrishnan (Tamil) |
Music | Allan Preetham |
Lyrics | Rakendu Mouli |
Star Cast | Anil Kumar Kompally, Yashna Muthuluri |
Music Label | Saregama Telugu |
Varshapu Vennela Song Lyrics
ఓ వర్షపు వెన్నెల… చలిలో ఎండ గాలులా
ఒకటైతే అలా… ఆమె కన్నులా
ఎవరో ఏమిటో… తెలియని వింత పరిచయం
తనతో ఈ క్షణం మొదలైందలా, ఆ ఆ
మళ్ళి మళ్ళి తానే ఎదురయిందిలే
కొత్త కొత్త ఆశ రేపుతోందిలే
తెలుసుకున్న కొద్ది మంచిగుందిలే
కలిసే రుచులు మనని కలుపుతోందిలే, ఏ
ఇంకా ఇంకా ఎదో ఎదో కావాలంది నా మనసే
చూపులతోనే చెబుతూ ఉంటె
ఓ సారైనా చదివేసెయ్
నీతో ఉంటే నన్నే నేనే మరిచే మాయే చేసావే
చూసే కొద్దీ చూడాలన్న చిత్రం… నీ చిరునవ్వే
నా మనసే…
నా మనసే, ఏ ఏ ఏ
నా మనసే…..
అడుగులే జతపడే… పయనం సాగే దారిలో
కబురులే తరగని సమయం ఆగే వేళలో
దూరమింక దూరమైయ్యే స్నేహం నిండే చోటులో
చిరు చిరు చొరవలే పెదవులు కోరే హాయిలో
కలో ఇలో తెలియని మైకంలోనే తూలనా
ఇలా అలా ఎలాగొలా నీలోన వాలనా
నరం నరం తరించిపోయే అందం చూడనా
మరి మరి మరింతలైనా జరిగేదాగునా??
కలలే కూలి పడిపోయే
ఊహలు చెదిరి విడిపోయే
నాదనుకున్న నీ నవ్వే
వదిలి వెలిపోయే..!
గతమై పోయే నీ ప్రేమ
తీరిగోస్తుంద ఆ జన్మ ?
ప్రాణంలోన సగ భాగం
ఎపుడు నీదమ్మా..!
నువ్వులేక నేను లేననే నిజం
(లేననే నిజం)
రోజు నన్ను కాల్చుతున్న జ్ఞాపకం
మాటలన్ని మౌనమైన జీవితం
మారుతుందో లేదో నా ప్రస్తుతం..!
ఇంకా ఇంకా నీతోనే నా జీవితం అన్నది నా మనసే
చూపులతోనే చెబుతూ ఉంటె
ఓ సారైనా చదివేసెయ్….
నీతో ఉన్న నిమిషంలోనే
మళ్ళి కొత్తగా పుట్టాలే
చూసే కొద్దీ చూడాలన్న చక్కని నవ్వు నీదేలే