Velledare Song Lyrics In Telugu & English – Swa Cinema Song

0
Velledare Song Lyrics
Pic Credit: Aditya Music (YouTube)

Velledare Song Lyrics penned by Karanam Sri Raghavendra, Manu PV music composed by Karanam Sri Raghavendra and sung by Abhijith Kollam, Anuradha Sreeram & Kalyan Vasanth from Telugu film ‘Swa‘.

Velledare Song Credits

Swa Movie
Director Manu PV
Producer GM Suresh
Singer Anuradha Sriram, Abhijith Kollam, Kalyan Vasanth
Music Karanam Sri Raghavendra
Lyrics Nagaraj Kuvvarapu
Star Cast Mahesh Yadlapalli, Swathi Bheemi Reddy
Music Label

Velledare Song Lyrics in English

Velledare Vele Vese
Teeram Cherenaa Ee Kadhe
Orvaleni Vaasthavaala
Vainame Maarche Kaalame

Lolona Regenu Evo Jadule
Avi Kaalaanikedhureedhi Poraadithe

Muncheti Uppenala… Kammindi Megham
Uvvetthu Naludhishalaa… Alle Andhakaaram
Saage Kala Ika Aagedhelaa
Veedadhe Nidura Udayam Choosedhelaa

Velle Daare Vele Vese
Teeram Cherenaa Ee Kadhe
Orvaleni Vaasthavaala
Vainame Maarche Kaalame

Watch వెళ్ళే దారే Video Song


Velledare Song Lyrics in Telugu

వెళ్ళే దారే వెలే వేసే… తీరం చెరేనా ఈ కధే
ఓర్వలేని వాస్తవాల… వైనమే మార్చే కాలమే

లోలోన రేగేను ఏవో జడులే
అవి కాలానికెదురీది పోరాడితే

ముంచేటి ఉప్పెనలా… కమ్మింది మేఘం
ఉవ్వెత్తు నలుదిశలా… అల్లే అంధకారం
సాగే కల ఇక ఆగేదెలా
వీడదే నిదుర ఉదయం చూసేదెలా

వెల్లే దారే వెలే వేసే… తీరం చెరేనా ఈ కధే
ఓర్వలేని వాస్తవాల… వైనమే మార్చే కాలమే

ఆ ఆ, తనువుతో చూస్తే… తుది తెలిసేనా
కనులతో కాస్తే కడ చేరేనా
మనసను మాటే… మతి అవుననునా
జరిగిన ఘడియనే… మరణం ఆపునా

కనుమల్లో లోయల్లో గాల్లో
దాగిదాగి చూసేవా నటన
ఆది అంతం అర్థం కాని
చావు బ్రతుకుల మధ్య తెరతీసి
చూసే చూపునిచ్చి నావ దరి చేర్చవా

వెళ్ళే దారికే తుదే లేదా
తీరం కనపడదే ఆవలా
చూసే చూపే నమ్మే మనసే
మాయే చేసిందా ఈ ఇలా

స్వభావ గుణమా… స్వయం కృతమా
స్వకీయ చింతన శూన్యమా
స్వాంగం స్వవసతో స్వస్తి పలుకు
స్వరం స్వనించేయవా, స్వ స్వ

ఆ ఆఆ ఆ, వలచిన చెలిమే
నను వదిలెల్లినా
తన ఊసేదో… నను తడిమేయగా
చెదరని స్వప్నమై… నను వెంటాడేగా
ఆశలు రేపి చేధించేయగా

నాలో నిన్నే దాచి
నీ నీడై నిన్నే చేరి… నీకోసమే బ్రతికా
ఈ నాటకంలో అంతులేని పాత్ర నేనై
అసుర చేతిలో… అంతమై మిగిలానిలా, ఇలా

అర్ధం కాని… అర్ధం లేని
అర్ధం కాని అర్ధం లేని… మాయే కమ్మిందా అంతలా
సత్యం ఏంటో… స్వప్నం ఏంటో
సత్యం ఏంటో స్వప్నం ఏంటో
తెలుసుకోలేక యాతనా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here