Vennello Mutyama Song Lyrics penned by Veturi, music composed by SP Balu, and sung by SP Balasubramanian & S Janaki from Telugu movie ‘Mayuri‘.
Vennello Mutyama Song Credits
Mayuri Telugu Cinema Released Date – 08th March 1985 | |
Director | Singeetham Srinivasa Rao |
Producers | Ramoji Rao |
Singers | SP Balu, S Janaki |
Music | S P Balasubramanyam |
Lyrics | Veturi Sundararama Murthy |
Star Cast | Sudha Chandra |
Vennello Mutyama Song Lyrics
Ennello Muthyamaa
Endallo Padmamaa
Seekatlo Deepamaa
Sirike Prathiroopamaa.!
Ye Pero, Ye Ooro Cheppavammaa
Teluginti Kalikanti Thenelamaa
Cheppavammaa Thenelamma
Cheppavamma Thenelamma
Mahakavi Gurajada
Manasa Putrikavu Neevu
Puthadi Bommavaa
Ha, Purnammavaa Aa AaAa
Naa Kannulu Kaluvala Rekalani
Naa Adugulu Hamsala Raakalani
Naa Palukulu Thenela Vaakilani
Telisi Telisi Entha Vagachinaa
Thathathone Mudipettaaru
Thaalithone Uri Teesaaru
Ammallaara Akkallaara
Aakashamlo Chukkallaara
Nelakosaari Vastu Unnaa
Nindugaa Punnaminai
Meelone Jeevistunnaa
Puthadi Bomma PurnamaNai
Puthadi Bomma PurnamaNai
Vishwanadhuni Chetha Tholinati Kavitavai
Viritheneyalu Pongu Selayeti Vanithavi
Velugondhu Telugu Jilugulu Ranivi
Avunu Kinnerasanivi
Tholutha Naa Kanneeru
Kaalvalai Paarindhi
Pidhapa Adhi Vaagulai
Vankalai Pongindhi
Tharagalai Nuragalai
Tharagale Padagalai
Padagale Adugulai
Adugule Madugulai
Paruguletthina Daanini
Nenu Paruvaala Dorasaanini
Koduku Dashane Daati
Magadu Kaaleni Oka Paduchuvaadiki
Thagani Gadusu Illaalini
Nenu Kinnerasanini
Pellaina Telugu Kannela Saatini
Nenu Kinnerasanini
Pellaina Telugu Kannela Saatini
Evareruganidhamma Nanduri Yenki
Puvvulaa Navveti Telugu Poobanthi
Kadavakaina Ledhu Thodimantha Edamoo
Edamettaaguntaadhi Pidikade Nadumoo
Kadavakaina Ledhu Thodimantha Edamoo
Edamettaaguntaadhi Pidikade Nadumoo
Mabbu Therane Vidiche Vanka Jaabilli
Ubbaraala Raikalo Thepparillee
(Abbalaalo Emi Nibbaraalo)
Jaarupaite Chaalu Javali Paatu
Naayidori Jaana Nadicheti Veena
Venni Thadithe Chaalu Vennellu Karugu
Govu Podhugullona Godari Pongu
Ennelammanu Chidipi
Edumallelu Podhipi
Telugintaa Puttindhi
Eluganti Yenki
Telugalle Eligindhi Chilakanti Enki
Eluganti Yenki… Chilakanti Enki
Eluganti Yenki… Aa Aa
Chilakanti Enki
Eluganti Yenki… Chilakanti Enki
Ennello Muthyama Song Lyrics
ఎన్నెల్లో ముత్యమా
ఎండల్లో పద్మమా
సీకట్లో దీపమా
సిరికే ప్రతిరూపమా..!
ఏ పేరో ఏ ఊరో చెప్పవమ్మా
తెలుగింటి కలికంటి తేనెలమా
చెప్పవమ్మా తేనెలమ్మా
చెప్పవమ్మా తేనెలమ్మా
మహాకవి గురజాడ
మానస పుత్రికవు నీవు
పుత్తడి బొమ్మవా
హ, పూర్ణమ్మవా ఆఆ ఆ ఆ
నా కన్నులు కలువల రేకలనీ
నా అడుగులు హంసల రాకలనీ
నా పలుకులు తేనెల వాకిలనీ
తెలిసీ తెలిసీ ఎంత వగచినా
తాతతోనే ముడిపెట్టారు
తాళితోనే ఉరితీశారు
అమ్మల్లారా అక్కల్లారా
ఆకాశంలో చుక్కల్లారా
నెలకోసారి వస్తూవున్నా
నిండుగా పున్నమినై
మీలోనే జీవిస్తున్నా
పుత్తడి బొమ్మా పూర్ణమనై
పుత్తడి బొమ్మా పూర్ణమనై
విశ్వనాధుని చేత తొలినాటి కవితవై
విరితేనేయలు పొంగు సెలయేటి వనితవై
వెలుగొందు తెలుగు జిలుగుల రాణివి
అవును కిన్నెరసానివి
తొలుత నా కన్నీరు కాల్వలై పారింది
పిదప అది వాగులై
వంకలై పొంగింది
తరగలై నురగలై
తరగలే పడగలై
పడగలే అడుగులై
అడుగులే మడుగులై
పరుగులెత్తిన దానినీ
నేను పరువాల దొరసానినీ
కొడుకు దశనే దాటి
మగడు కాలేని ఒక పడుచువాడికి
తగని గడుసు ఇల్లాలిని
నేను కిన్నెరసానినీ
పెళ్ళైన తెలుగు కన్నెల సాటిని
నేను కిన్నెరసానినీ
పెళ్ళైన తెలుగు కన్నెల సాటిని
ఎవ్వరెరుగనిదమ్మ నండూరి ఎంకీ
పువ్వులా నవ్వేటి తెలుగు పూబంతీ
కడవకైనా లేదూ తొడిమంత ఎడమూ
ఎడమెట్టాగుంటాది పిడికడే నడుమూ
కడవకైనా లేదూ తొడిమంత ఎడమూ
ఎడమెట్టాగుంటాది పిడికడే నడుమూ
మబ్బుతెరనే విడిచే వంకా జాబిల్లి
ఉబ్బరాలా రైకాలో తెప్పరిల్లీ
(అబ్బలాలో ఏమి నిబ్బరాలో)
జారుపైటే చాలు జావళీ పాటు
నాయిడోరి జాణ నడిచేటి వీణ
వెన్ను తడితే చాలు వెన్నెల్లు కరుగు
గోవు పొదుగుల్లోనా గోదారి పొంగు
ఎన్నెలమ్మను చిదిపి
ఏడుమల్లెలు పొదిపి
తెలుగింటా పుట్టింది… ఎలుగంటి ఎంకీ
తెలుగల్లే ఎలిగిందీ… చిలకంటి ఎంకీ
ఎలుగంటి ఎంకీ… చిలకంటి ఎంకీ
ఎలుగంటి ఎంకీ, ఆఆ
సిలకంటి ఎంకీ
ఎలుగంటి ఎంకీ… చిలకంటి ఎంకీ