Home » 2002 Telugu Movie » వద్దురా సోదరా సాంగ్ లిరిక్స్ – Manmadhudu (2002)

వద్దురా సోదరా సాంగ్ లిరిక్స్ – Manmadhudu (2002)

by Devender

వద్దురా సోదరా సాంగ్ లిరిక్స్ penned by Sirivennela Seetharama Sastry, music composed by Devi Sri Prasad, and sung by S P Balasubramanyam from Telugu cinema ‘Manmadhudu‘.

వద్దురా సోదరా సాంగ్ Credits

Movie Manmadhudu (20th December 2002)
Director K Vijaya Bhaskar
Producer Nagarjuna Akkineni
Singer S P Balasubramanyam
Music Devi Sri Prasad
Lyrics Sirivennela Seetharama Sastry
Star Cast Nagarjuna, Sonali Bendre, Anshu
Music Label

వద్దురా సోదరా సాంగ్ లిరిక్స్

Voddhura Sodhara Song Lyrics in Telugu

హా ఆ ఆ ఆ ఆ ఆ… శభాష్
సగమపా రీపా మపగా
రీ సనీపా మపనీసా

రేయ్… వద్దురా సోదరా
అరె పెళ్లంటే నూరేళ్ళ మంటరా
ఆదరా బాదరా నువ్వెళ్లెళ్ళి గోతిలో
పడొద్దురా రేయ్…
వద్దురా వద్దు
వద్దురా సోదరా
అరె పెళ్లంటే నూరేళ్ళ మంటరా
ఆదరా బాదరా నువ్వెళ్లెళ్ళి గోతిలో

చెడిపోవద్దు బ్రహ్మచారి
పడిపోవద్దు కాలు జారి
తాళి కట్టొద్దు ఖర్మకాలి
ఆలి అంటేనే భద్రకాళి
కళ్యాణమే ఖైదురా
జన్మంతా విడుదల లేదురా
నీ కొంపముంచేస్తుందిరా
ఆపుకోలేని ఈ తొందర

డోంట్ మ్యారీ హే… బీ హ్యాపీ హో
డోంట్ మ్యారీ హే… బీ హ్యాపీ ఏ ఏ ఏ
డోంట్ మ్యారీ హే… బీ హ్యాపీ హో
డోంట్ మ్యారీ హే… బీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ

వద్దురా సోదరా
అరె పెళ్లంటే నూరేళ్ళ మంటరా
ఆదరా బాదరా నువ్వెళ్లెళ్ళి గోతిలో
పడొద్దురా హ హ హ

శివ అని… నా క్లోజ్ ఫ్రెండ్
లవ్‌లో పడి పెళ్లి చేసుకున్నాడు
కాలేజీలో వాడు గ్రీకువీరుడు
మ్యారేజి కాకముందు రాకుమారుడు
అంతా జరిగి జస్ట్ వన్ మంత్ కాలేదు
ఎంత మారిపోయాడో గుర్తుపట్టలేనట్టూ

బక్కచిక్కి పోయి… మంచి లుక్ పోయి
ఫేసు పాలిపోయి… జుట్టు రాలిపోయి
ఈ దేవదాసు వాలకం దేనికంటే
తను దేవిదాసు కావడం వల్ల అంటూ
గుక్కపట్టి ఏడ్చాడు… ముక్కు చీదుకున్నాడు
ఒక్క చుక్క మందుకొట్టి… ఫ్లాష్‌బ్యాక్ చెప్పాడు

పొద్దున్న లేస్తూనే
తన అందాన్ని పొగడాలి
మరి ఏపూటకాపూటే
తనకి ఐ లవ్ యూ చెప్పాలి
ఏం కోరినా తక్షణం
తీర్చాలిరా ఆ వరం
కత్తిసామైందిరా కాపురం
పెళ్లి క్షమించరాని నేరం

డోంట్ మ్యారీ హెయ్… బీ హ్యాపీ ఆ
డోంట్ మ్యారీ హెయ్… బీ హ్యాపీ ఏ ఏ ఏ
డోంట్ మ్యారీ హే… బీ హ్యాపీ హో
డోంట్ మ్యారీ హే… బీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ

వద్దురా సోదరా
అరె పెళ్లంటే నూరేళ్ళ మంటరా
ఆదరా బాదరా నువ్వెళ్లెళ్ళి గోతిలో
పడొద్దురా వద్దురా వద్దు

అంతెందుకు మా మల్లిగాడు
మా ఊళ్లో వాడంతటోడు లేడు
మామూలుగానే వాడు దేశముదురు
పెళ్లితోటే పోయింది వాడి పొగరు
ఇల్లాలు అమ్మోరు… పల్లేక ఇంటిపోరు
చల్లారి పోయింది వాడి నెత్తురు

ఒక్కపూట కూడ ఉండదనుకుంటా
కస్సుమనకుండ బుర్ర తినకుండా
వాన్ని తిట్టింతిట్టు తిట్టకుండా వెంటపడి
తరుముతూనే ఉంటదంటా వీధి వెంటా
కోడెనాగులాంటి వాన్ని వానపాము చేసింది
ఆలి కాదురా అది అనకొండ

ఆ గయ్యాళి యమగోల
కలిగించింది భక్తి యోగం
ఆ ఇల్లాలి దయ వల్ల కనిపించింది ముక్తిమార్గం
సంసారమే వేస్టనీ… ఇక సన్యాసమే బెస్టనీ
కాషాయమే కట్టాడురా… కట్టి కాశీకి పోయాడురా

డోంట్ మ్యారీ హే… బీ హ్యాపీ హో
డోంట్ మ్యారీ హే… బీ హ్యాపీ ఏ ఏ ఏ
డోంట్ మ్యారీ హే… బీ హ్యాపీ హో
డోంట్ మ్యారీ హే… బీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ

వద్దురా సోదరా
అరె పెళ్లంటే నూరేళ్ళ మంటరా
ఆదరా బాదరా నువ్వెళ్లెళ్ళి గోతిలో
పడొద్దురా హ హ హ

డోంట్ మ్యారీ హెయ్… బీ హ్యాపీ ఆ
డోంట్ మ్యారీ నెవర్… బీ హ్యాపీ ఎస్ ఎస్ ఎస్
డోంట్ మ్యారీ ఆహ… బీ హ్యాపీ హో అహ్హ
డోంట్ మ్యారీ ఏయ్… బీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ అయ్

Watch Voddhura Sodhara Song

You may also like