హెచ్చరిస్తూనే ఉదారత చాటుకున్న ఎమ్మెల్యే రజిని – లస్సీ వ్యాపారులకు ఆర్ధిక సాయం

హెచ్చరిస్తూనే ఉదారత చాటుకున్న ఎమ్మెల్యే రజిని - లస్సీ వ్యాపారులకు ఆర్ధిక సాయం

లాక్‌డౌన్ వేళ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ నిత్యం ప్రజల మధ్య ఉంటూ తనవంతుగా సామాజిక సేవ చేస్తుంటుంది చిలకలూరి పేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజిని. చిలకలూరి పేటలో రోడ్డు పక్కన ఇద్దరు వ్యక్తులు లస్సీ అమ్ముతూ కనిపించారు. అది చూసిన ఎమ్మెల్యే కారు దిగి వారి దగ్గరకు వచ్చి హెచ్చరించడమే కాక చెరో 2 వేల రూపాయల సహాయం చేసింది.

హెచ్చరిస్తూనే ఉదారత చాటుకున్న ఎమ్మెల్యే రజిని

కరోనా వైరస్ దృష్ట్యా ప్రభుత్వం ఎవరినీ రోడ్ల మీదకు రావద్దని కోరింది, లాక్‌డౌన్ ఉండగా మీరిలా బయట తిరుగుతూ లస్సీ అమ్ముతున్నారంటే జనాలు బాగా తిరుగుతున్నారని అనుకోవాలి. రోజుకు 20 నుండి 30 మందికి అమ్ముతామని వారు చెప్పారు. మీరెందుకు పెట్టారు, ఎవరన్నా అమ్ముతున్నారా. ప్రభుత్వం ఇన్ని రకాలుగా చెప్తున్నా వినరా అని మందలించింది ఎమ్మెల్యే.

ఇక్కడ పరిస్థితులు అదుపులో ఉన్నాయి. ఇలా చేయడం వల్ల మంచిది కాదు. రేషన్ వస్తుంది, ప్రభుత్వం డబ్బులు కూడా ఇచ్చింది కదా… అవసరమా. మీకు కుటుంబం ఉంది. మీవల్ల వారికేమి కాకూడదు కదా. మీకు ఏమైనా సమస్యలు ఉంటె నాకు చెప్పండి. ఆరోగ్యం కన్నా మించింది ఏమీ లేదు కదా. మీరు కొన్ని రోజులు మానుకోండి, ఇంటి దగ్గరే ఉండండి అని హితవు పలికారు ఎమ్మెల్యే రజిని.

తరువాత తల రెండు వేల రూపాయలు ఇచ్చి మాన‌వ‌త్వాన్ని చాటుకున్నారు. ఇంకోసారి బయటికి వస్తే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు.

మొన్న కూడా లాక్‌డౌన్ వేళ 60 ఏళ్ల‌కు పైబడిన రిక్షా కార్మికుడిని చూసి చలించి ఆర్థిక సాయం, కూర‌గాయ‌లు అంద‌జేశారు ఎమ్మెల్యే రజిని.

హెచ్చరిస్తూనే ఉదారత చాటుకున్న ఎమ్మెల్యే రజిని – లస్సీ వ్యాపారులకు ఆర్ధిక సాయం – వీడియో

Also Read: AP SEC Ramesh Kumar Removed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *