గాంధీ ఆసుపత్రిలో డాక్టర్ వసంత్ ఆత్మహత్య యత్నం – అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు

0
గాంధీ ఆసుపత్రిలో డాక్టర్ వసంత్ ఆత్మహత్య యత్నం

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో డాక్టర్ వసంత్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. పొత్తి కడుపులో పెట్రోల్ బ్యాగ్లు పెట్టుకొని
చేతులో లైటర్ పట్టుకొని సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నించడంతో ఒక్కసారిగా ఆసుపత్రిలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఏమి జరుగుతుందో తెలియక రోగులు మరియు వారి బంధువులు అయోమయంలో పడ్డారు.

దాదాపుగా గంటన్నర పాటు ఈ హైడ్రామా జరిగింది. పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది ఎంత వారించినా డాక్టర్ వసంత్ ఆత్మహత్య
ప్రయత్నాన్ని విరమించలేదు. మీడియా ముందు హెచ్ఓడి తో  మాట్లాడుతుండగా ఒక్కసారిగా పోలీసులు అతని దగ్గర ఉన్న లైటర్ ను లాక్కొని నీళ్ళు చల్లి షర్ట్‌లో ఉన్న పెట్రోల్ బాటిల్లను తీసి వేశారు. పోలీస్ వాహనంలో ఎక్కించుకొని డాక్టర్ వసంత్ ను సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఇంతకీ డాక్టర్ వసంత్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అతనికి రెండు రోజుల ముందు ఉద్యోగం నుండి తొలగించారని. వసంత్ తో పాటు మరో ముగ్గురు డాక్టర్లపై కూడా చర్యలు తీసుకుంది ఆసుపత్రి పర్గాలు.

అయితే గాంధీ ఆసుపత్రిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులున్నాయంటూ నేను ప్రచారం చేశానని చెప్పి తప్పుడు ఆరోపణలతో నన్ను బలిపశువును చేసింది ఆర్ఎంఏ, సూపెరిండేంట్ లని ఆరోపించాడు.

ఆర్ఎంఏ రమేష్ రెడ్డి దీని మీద వివరణ ఇచ్చాడు. ఒక గవర్నమెంట్ డాక్టర్ ఇలా ప్రవర్తించడం అస్సలు మంచి విధానం కాదు,
దురదృష్టకరం. అసలు కరోనా వైరసే లేదు, అలాంటప్పుడు అది సాకుగా చూపి అతని మీద చర్య తీసుకోలేదు. ఇతర పై
సిబ్బంది మీద దురుసుగా దుర్భాషలాడడం, ప్రవర్తించడం వల్ల మాత్రమే చర్య తీసుకున్నామని రమేష్ రెడ్డి వివరణ ఇచ్చాడు.
గతంలో అతడిపైనే చాలా ఆరోపణలు ఉన్నాయని, ఈ విషయమై పలు సార్లు మందలించడం కూడా జారింది రమేష్ రెడ్డి చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here