అల వైకుంఠపురములో ట్రైలర్ విడుదల – Ala Vaikunthapurramuloo Theatrical Trailer

అల వైకుంఠపురములో ట్రైలర్ అదరగొట్టింది…

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురములో…’ భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రం మ్యూజిక్ కన్సార్ట్ హైదరాబాద్ లో జరుగుతున్న సందర్బంగా ట్రైలర్ విడుదల చేసింది చిత్ర బృందం.

అల వైకుంఠపురములో ట్రైలర్ చూస్తుంటే బన్నీ అభిమానులకు ఏం కావాలో దర్శకుడు త్రివిక్రమ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. పూజా హెగ్డే కథానాయికగా బన్నీ సరసన నటిస్తుండగా టబు మాలిక్ చాలా కాలం తరువాత తెలుగులో ముఖ్యపాత్రలో కనిపించనున్నారు.

సంక్రాంతి కానుకగా జనవరి 12, 2020 ఆదివారం నాడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి వస్తుంది అల వైకుంఠపురములో చిత్రం.