తెలంగాణాలో ఈరోజు 18 ఏప్రిల్ 43 కరోనా పాజిటివ్‌ కేసులు – జీహెచ్ఎంసీలోనే ఎక్కువ

తెలంగాణాలో ఈరోజు 18 ఏప్రిల్ 43 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణాలో ఈరోజు 18 ఏప్రిల్ 43 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన లెక్కల ప్రకారం ఈరోజు శనివారం మొత్తం 43 కేసులు నమోదుకాగా ఇందులో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పేరేషన్ పరిధిలోనే ఎక్కువ కేసులు రిపోర్టు అయ్యాయి.

ఈ 43 కేసులు కలుపుకొని ఇప్పటి వరకు తెలంగాణాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 809కి చేరింది. ఈరోజు వివరాల ప్రకారం 605 యాక్టివ్‌ కేసులు ఉండగా, 186 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 18 మంది వైరస్ భారిన పడి చనిపోయారు (ఈరోజు మరణాలు సంభవించలేదు).

తెలంగాణాలో ఈరోజు 18 ఏప్రిల్ 43 కరోనా పాజిటివ్‌ కేసులు – ఎక్కడ ఎన్ని కేసులు ?

ఈరోజు నమోదయిన 43 కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 31 కేసులు నమోదు కాగా జోగులాంబ గద్వాల జిల్లాలో 7 కేసులు, రాజన్న సిరిసిల్ల మరియు రంగారెడ్డి జిల్లాల్లో 2 కేసుల చొప్పున నల్గొండ జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు నమోదయినట్టు ఆరోగ్య శాఖా వెల్లడించింది.

809 కరోనా కేసుల్లో ఒక్క హైదరాబాద్ లోనే 448 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


The reCAPTCHA verification period has expired. Please reload the page.