తెలుగు సినిమాకు ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ‘శివ’ చిత్రానికి నేటికి సరిగ్గా 30 సంవత్సరాలు. శివ తరువాత శివకు ముందు
అనేలా అప్పట్లో అదరగొట్టింది ఈ చిత్రం. ఇప్పటికీ ఈ చిత్రం నూతన దర్శకులకు ఆదర్శంగా నిలుస్తుంది అనడంలో ఏలాంటి సందేహం లేదు.
రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున, అమల ప్రధాన పాత్రలో నటించిన శివ అప్పట్లో తెలుగు సినీ చరిత్రలో ఒక నూతన ఒరవడి సృష్టించింది.
అక్టోబర్ 5,1989న విడుదలైన శివ చిత్రంలో ఒక సన్నివేశం చిత్రానికే హైలైట్, ఆ సన్నివేశమే హీరో నాగార్జున సైకిల్ చైన్ లాగడం. ఈ సన్నివేశం ట్రెండ్ కె ట్రెండ్ సెట్టర్. అందుకే శివ సినిమా అనగానే ప్రతీ ఒక్కరి మదిలో ఈ సన్నివేశమే మెదులుతుంది.
శివ చిత్రం 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్ చేశారు.
హే.. నాగార్జున ఈ రోజు మన ప్రియమైన బిడ్డ 30వ పుట్టినరోజు అని చిత్ర పోస్టర్ ను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.
Hey @iamnagarjuna , today is the 30th birthday of our love child 😍😍😍 pic.twitter.com/i7RLgjiX95
— Ram Gopal Varma (@RGVzoomin) October 5, 2019