ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మిర్యాలగూడకు చెందిన వ్యాపారి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఖైరతాబాద్ లోని చింతల్ బస్తీలో ఉన్న ఆర్యవైశ్య భవన్ మూడో అంతస్థు రూం నెంబర్ 306 గదిలో మారుతీరావు ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
అయితే శనివారం తన డ్రైవర్ రాజేష్ తో కలిసి మారుతీరావు ఆర్యవైశ్య భవన్ లో దిగాడు. డ్రైవర్ బయటే ఉండగా అతను గదిలోనే ఉన్నాడు. భార్య చేసిన ఫోన్ కాలును ఎంతకూ సమాధానం లేకపోవడంతో డ్రైవర్ కి ఫోన్ చేయాగ, డ్రైవర్ గది తలుపు కొట్టగా తీయకపోవడంతో అక్కడున్న సిబ్బందితో కలిసి బలవంతంగా తలుపు తెరిచి చూడగా బెడ్ మీద విగతజీవిగా పడివున్నాడు.
పోలీసులకు సమాచారం ఇవ్వగా అనుమానాస్పద కేసుగా పోలీసులు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్య లేక సాధారణ మరణమా అనే కోణంలో విచారణ కొనసాగుతుంది.
ఘటన స్థలంలో లభించిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో ‘గిరిజా, క్షమించు అమృతా అమ్మ దగ్గరికి రా!’ అని రాసి ఉంది.
సెప్టెంబర్ 14, 2018న పెరుమాళ్ళ ప్రణయ్ ను హత్య చేసిన ఘటనలో మారుతీరావు ప్రధాన నిందితుడు. కూతురు అమృత ప్రేమవివాహం ఇష్టంలేక ప్రణయ్ ను హత్య చేయించింది మారుతీరావు అనే భావించి ఏ1 గా భావించి అతడిని అరెస్ట్ చేశారు. బెయిల్ పై విడుదలవగా కేసు విచారణలో ఉంది.