Akhanda Dialogues Lyrics – Balayya Powerful Dialogues

0
Akhanda Dialogues Lyrics
Pic Credit: Lahari Music | T-Series (YouTube)

Akhanda Dialogues Lyrics from the movie AKHANDA, dialogues given by M Ratnam, music composed by Thaman S, and directed/written by Boyapati Srinu.

Akhanda Movie Dialogues Credits

Movie Akhanda (02 December 2021)
Director & Writer Boyapati Srinu
Dialogues M Ratnam
Producer Miryala Ravinder Reddy
Music Thaman S
Star Cast Nandamuri Balakrishna, Pragya Jaiswal, Srikanth
Video Label

Akhanda Dialogues Lyrics in Telugu

Kotte Rakam Dialogue

✦ నేను గెలికితే కొట్టే రకం కాదు. గెలుక్కుని కొట్టే రకం. వెంటపడితే కొట్టే రకం కాదు, వెంటపడి కొట్టే రకం
ఎదురొస్తే కొట్టే రకం కాదు. ఎదురెల్లి కొట్టే రకం. మేమెక్కడికైనా వస్తే తల దించుకోం, తల తెంచుకొని వెళ్ళిపోతాం.

Pilla Kaaluva Dialogue

అరేయ్ మేమేంటో అంచనా లేకుండా హామీలిస్తుండాం.
బాలయ్య: ఏయ్..! అంచనా వేయడానికి నువ్వేమైనా పోలవరం డ్యామా, పట్టిసీమ తూమా..? పిల్ల కాలువ.

Yeduti Vaallatho Maatladetappudu Dialogue

ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో.
శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా దానికి,
    శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా అనే దానికి చాలా తేడా ఉందిరా లంబిడి కొడకా..!!

Manashulni Gelavadam Dialogue

✦  శత్రువుల్ని గెలవడం ఈజీ. కానీ, మనుషుల్ని గెలవడం చాలా కష్టం. ప్రయత్నించు.
మీకు నొప్పి తెలియాలని కొట్టలే, తప్పు తెలియాలని కొట్టా.
✦  చెట్టు నేలతల్లి మీద బొట్టు లాంటిది. నరకడం మొదలుపెడితే, నీడ ఉండదు… గూడు ఉండదు…           మనిషికి మనుగడే ఉండదు.
✦  నరికిన ఆ చేతులతోనే ఒక్క మొక్క పెంచి చూడండి. చెట్టు విలువ, మట్టి విలువ తెలుస్తుంది.
✦  ఈ సొసైటీకి మీరు పునాదులురా, సమాధులు కావొద్దు.

Mana Ooru Dialogue

✦ ఏ ప్రాంతంలోనైనా మంచి ఆస్తులు ఉన్నవాడు గొప్పవాడు కాదు. మంచి ఆలోచన ఉన్నవాడు గొప్పవాడు.
ఒకడు తప్పు చేస్తే ఎవరి బిడ్డ అని అడుగుతారు, ఒకరు మంచి చేస్తే ఏ ఊరి బిడ్డ అని అడుగుతారు. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి మనం చచ్చే వరకు ఒంటి మీద వందల డ్రెస్సులు మార్చొచ్చు. కానీ, మార్చలేనిది ఒక్కటే. అది మన అడ్రస్. అదే మన ఊరు. దాన్ని కాపాడే భాధ్యత మనదే, మనందరిదీ.
Pure minds give a clean society and a great future. Thank You.

Murali Krishna Dialogue

✦ ఇగో మురళీకృష్ణ ఫికర్ పడకు. మా తెలంగాణలో నచ్చినోళ్ళని, దగ్గరోళ్ళని ఏకవచనంతో పిలుస్తం. మా మాటల్లో పెత్తనం ఉంటది కానీ, మనసు మెత్తగుంటది. నీకు ఓకే కదా..!

Nee Cheerakattu Dialogue

✦ నీ చీరకట్టులో తెలుగుతనం ఉంది. మీ నడకలో హుందాతనం ఉంది. మీ మాటల్లో ముక్కుసూటి తనం ఉంది. నాకు నచ్చాయండి.

Thala Bhojanam Dialogue

శ్రీకాంత్: ఇకనుంచి ఎవ్వరైనా సరే. నాకు బురదంటింది, నాకు దురదొచ్చింది, నాకు బ్లడొచ్చింది, నా గడ్డొచ్చింది అని అడ్డమైన సాకులు చెప్తు పనాపితే… నా కొంపకే పిలిచి గూడెం గూడెం మొత్తానికి ఆకులేసి పెడతా తల భోజనం.

Vetaade Simhanni Dialogue

✦ శ్రీకాంత్: ఇది నా సామ్రాజ్యంరా..!
బాలయ్య: కూల్చేస్తా.
✦ శ్రీకాంత్: ఏయ్..! నేను నీ రణాన్ని.
బాలయ్య: నేను నీ మరణాన్ని.
✦ శ్రీకాంత్: నేను విలయం.
బాలయ్య: నేను ప్రళయం.
శ్రీకాంత్: నన్ను ముట్టుకోలేవ్.
బాలయ్య: నన్ను తట్టుకోలేవ్.
శ్రీకాంత్: నేను మృగాన్నిరా.
బాలయ్య: నేను దాన్ని వేటాడే సింహాన్నిరా

Okkasari Decide Aithe Dialogue

✦ రైటైనా రాంగైనా ఒకసారి డిసైడై దిగితే, ఎవడెదురొచ్చినా వక్కలు పగిలిపోతాయ్.
✦ ఒకసారి డిసైడై బరిలోకి దిగితే బ్రేకుల్లేని బుల్డోజర్ ని. తొక్కిపారదొబ్బుతా.
✦ లెఫ్ట, రైటా, టాపా, బాటమా ఎటునుంచి రేకు పెట్టి గోకినా. కొడకా..! ఇంచు బాడీ దొరకదు.

Yey Matti Joluki Dialogue

బాలయ్య: అరేయ్..! మట్టిజోలికొచ్చావ్, పాలిచ్చే పశువు జోలికొచ్చావ్, ప్రాణం పొసే నీటి జోలికొచ్చావ్, ఆఖరికి నా జనం జోలికొచ్చావ్. నిన్నెందుకు వదిలిపెడతానురా లండికే.
శ్రీకాంత్: ఏయ్..! మర్యాద.
బాలయ్య: మర్యా..! Respect comes from behaviour, not by begging.
శ్రీకాంత్: ఏయ్..! అంతఃపురం వరదరాజులిక్కడ.
బాలయ్య: నువ్వు పుట్టింది అంతఃపురంలో అయితే నేను పుట్టింది, అనంతపురంలో.

Shivudu – The Aghora Dialogue

సోమసూర్య అగ్నిలోచనుడు, శ్వేతవృషభ వాహనుడు, శూల బాణ భుజంగ భూషణుడు, త్రిపురనాశక రక్షకుడు. శివుడూ……

Daiva Saasanam Dialogue

✦ ఒక మాట నువ్వంటే అది శబ్దం. అదే మాట నేనంటే శాసనం. దైవ శాసనం.

Kapalam Pagilipoddi Dialogue

కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది. కారు కూతలు కూస్తే కఫాలం పగిలిపోద్ది.

Neene Dialogue

వీళ్ళను కాపాడింది… నేనే.
ఆ భైరాగిని చంపింది… నేనే.
ఆ, ఆ నలభై మందిని చంపింది… నేనే.

Shiv Ka Sainik Dialogue

✦ గమ్యం కైలాసం, భుక్తం కపాలం, ఆయుధం త్రిశూలం, కర్తవ్యం దృష్ట్యసంహారం. సైనిక్, శివ్ కా సైనిక్. దైవం జోలికొస్తే దవడ పగిలిపోద్ది.

Devunni Karuninchamani Dialogue

✦ భగవంతుడు సృష్టికి తండ్రి. ప్రకృతి తల్లి. వాటికి పుట్టిన బిడ్డే ఈ విజ్ఞానం. ఇది నిజం తెలుసుకోండి.
✦ దేవుణ్ణి కరుణించమని అడుగు, కనిపించమని కాదు.

Antham Dialogue

✦ నాకో మైనుంది, ఒంట్లో మదముంది, నా వెనక మందుంది, నాకో గురువున్నాడు, నా గుండున్నాడని నేలతల్లి మీద చెయ్యేస్తే… అంతం. ఓం నమఃశివాయ. శివార్పనం

Krimi Samharam Dialogue

✦ ఏంటి మారణహోమం.?
ఇక్కడ నేను క్లీన్ చేసింది మనుషుల్ని కాదు, కాలుష్యాన్ని. పొల్యూషన్ ప్యాషన్ అయిపోయింది ప్రతిఒక్కడికి. అందుకే మొదలుపెట్టాం, డస్ట్ క్లీనింగ్. In another way pest cleaning. క్రిమిసంహారం.

Both Are Not Same Dialogue

✦ నెవర్, మీది మాది ఒకే ప్రపంచం కాదాఫీసర్..! మీరు చదివింది చట్టం, మేము నమ్మేది ధర్మం. Both are not same.
✦ మీరాదేవుడి కోసం వెతుకుతారు. మేమాదేవుడితోనే కలిసి బతుకుతాం. Both are not same.
✦ మీకు కుటుంబమే ప్రపంచం. మాకు ప్రపంచమే కుటుంబం. Both are not same.
మీరు వెతికేది ఆయువు, మేము వెతికేది మృత్యువు. Both are not same.
✦ ఇంత ఐస్ ముక్కని అరనిమిషం అరచేతిలో పెట్టుకోలేని మీరెక్కడ..? అనుదినం అనంత గిరుల్ని ఢీ కొట్టే మేమెక్కడ..?? Both are not same.
మీకు సమస్యోస్తే దండం పెడతారు. మేమాసమస్యకే పిండం పెడతాం. జస్ట్ లైక్ దిస్. Both are not same.
మనిషి మనుగడ కోసం మేము స్మరించేది మంత్రం. ఆ మనుగడకే ప్రమాదమొస్తే మేము చేసేది యుద్ధం. దారుణమైన యుద్ధం.

Dharma Rakshana Dialogue

✦ అహింసా పరమో ధర్మః ధర్మ హింస తదైవచ… దాని అర్థమేమిటో తెలుసా..!
✦ అహింస మానవుని యొక్క ప్రధమ ధర్మం. కానీ, ధర్మ రక్షణకోసం చేయు హింస అంతకంటే శ్రేష్టం. ఇప్పుడు జరిగిందది అదే. ఇక ముందు మనిషి దారి తప్పితే జరగబోయేది అదే.

Ventaadi Vadistham Dialogue

✦ ధరణిని, తరుణిని అత్యాచారం చేసిన వాడికి no right to live. వదలం, వదిస్తాం. వెంటాడి వదిస్తాం.

Akhanda’s Promise Dialogue

✦ మాటిస్తున్నా తల్లి..! కష్టమొచ్చినా కన్నీళ్లొచ్చినా, భాదొచ్చినా, భయమొచ్చినా, చివరికి ఆ మృత్యువే ఎదురొచ్చినా, నేనెక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా క్షణంలో నీ ముందుంటాను. మాట.

Watch అఖండ డైలాగ్స్


Akhanda Dialogues Lyrics in English

Never, Meedi maadhi oke prapancham kaadaafficer. meeru chadivindi chattam. Memu nammedhi dharmam. Both Are Not Same

Meeraadevudi Kosam vethukuthaaru. Memaadevudithone kalisi bathukuthaam, Both Are Not Same

Meeku kutumbame prapancham. Maaku prapanchame kutumbam. Both Are Not Same

Meeru vethikedhi aayuvu, memu vethikedi mruthyuvu. Both Are Not Same

Intha ice mukkani aranimisham arachethilo pettukoleni meerekkada? Anudinam anantha girulni Dhee kotte memekkada? Both Are Not Same.

Meeku samayosthe dandam pedathaaru. Memaasamasyake pindam pedatham. Just like this. Both Are Not Same.

Manishi manugada kosam memu smarinchedhi manthram. Aa manugadake pramadamosthe memu chesedhi yuddham. daarunamaina yuddham.

Dev P
I am Dev P, a dedicated freelancer and professional blogger with a passion for music and writing. As the creator of 10to5.in, my mission is to provide quality and accurate lyrics for music enthusiasts. With a keen eye for detail and a commitment to excellence, I ensure that each song lyric is carefully curated to meet the highest standards. Explore 10to5.in for a comprehensive collection of song lyrics that cater to diverse musical tastes.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here