‘అల.. వైకుంఠపురములో’ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బన్నీ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నాడు అని ప్రతీ ఒక్కరు అనుకునే
ఉంటారు. అల్లు అర్జున్ నాన్న గారు అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం బన్నీ కెరియర్ లో ఎక్కువ వసూలు చేసిన చిత్రంగా నిలిచింది.
అయితే అల్లు అర్జున్ కు రెమ్యూనరేషన్ రూ. 100 కోట్లు ఇచ్చినట్టు పాత్రికేయుల సమావేశంలో సరదాగా వెల్లడించాడు అరవింద్. ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ మేము కలిసి ఒకే ఇంట్లో ఉన్నా ప్రొఫెషన్ విషయాలకు వచ్చే వరకు ఖచ్చితంగా ఉంటాము. అంటే తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అని అంటున్నారు అరవింద్ గారు.
చిరంజీవి గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా ఇంకెవరైనా సినిమా విడుదలకు వారం రోజుల ముందే ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ అందజేస్తాను అని అరవింద్ చెప్పుకొచ్చారు.
బన్నీ ఈవిషయంపై మాట్లాడుతూ, నాతో పాటు ఇతర హీరోలు ఆ టైంలో ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో అంతే రెమ్యునరేషన్
అందజేస్తారు, కాకుంటే ‘అల.. వైకుంఠపురములో’ చిత్రంతో ఆల్ టైమ్ కొట్టడం అనేది ప్రత్యేకం కాబట్టి ఖచ్చితంగా రెమ్యునరేషన్ కొంచెం ఎక్కువ ఇస్తే బాగుంటుంది అని నవ్వుతూ చెప్పాడు.
Read Also: బిజెపి తీర్థం పుచ్చుకున్న బ్యాడ్మింటన్ స్టార్ సైనా