బిజెపి తీర్థం పుచ్చుకున్న బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్

బ్యాడ్మింటన్ ఛాంపియన్ సైనా నెహ్వాల్ ఈ రోజు (బుదవారం) అధికార భాజాపాలో చేరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ
ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సైనాకు పార్టీ కండువా కప్పి సభ్యత్వ రసీదును అందజేశాడు. ఆమె అక్క అబూ చంద్రాన్షు
నెహ్వాల్ కూడా తనతో పాటు బిజెపిలో చేరారు.

“నేను నరేంద్ర మోడి గారి నుండి చాలా ప్రేరణ పొందాను, దేశం కోసం చాలా పతకాలు సాధించాను, కష్టపడి పనిచేసే వ్యక్తులను ప్రేమిస్తాను, ప్రధాని మోడీ దేశం కోసం ఎంతో కృషి చేస్తున్నారు, నేను అతనితో దేశం కోసం ఏదైనా చేయాలనుకుంటున్నాను” అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.

saina nehwal bjp

హర్యానాలో జన్మించిన 29 సంవత్సరాల సైనా నెహ్వాల్ భాజాలాలో చేరడం తమకు కలిసివస్తుందని డిల్లీ నాయకులు
అభిప్రాయపడుతున్నారు. ఫిబ్రవరి 8న జరిగే డిల్లీ ఎన్నికల ప్రచారానికి సైనా ప్రచారం చేసే అవకాశం లేకపోలేదు.

మాజీ ప్రపంచ నంబర్ 1 (2015 సం.లో) అయిన సైనాకు దేశంలోని అగ్రశ్రేణి క్రీడా అవార్డులైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, అర్జున
అవార్డులు లభించాయి. ఆమెకు 2016 లో పద్మభూషణ్ అవార్డు కూడా లభించింది.

saina sister joins bjp