Allukunna Ee Bandhame Song Lyrics ప్రణవం అందించగా, శరవణ వాసుదేవన్ సంగీతానికి శాండిల్య పిసపాటి పాడిన పాట ఆపరేషన్ రావణ్ చిత్రంలోనిది.
Allukunna Ee Bandhame Song Lyrics
చిననాటి నుండి నీ చుట్టూర తిరుగుతూ
నిన్నేమో ఇష్టపడుతు నువ్వే దిక్కని అంటూ
నువ్వే దక్కాలంటూ మిక్కిలి పూజలు చేస్తే
చిక్కుల్లో పడదోస్తివి… కూసింత కరుణ లేకా
ఎన్నెన్నో ఆటలేమో నీతో ఆడుతు పెరిగి
నీ చేతిలో ఇపుడు ఆటబొమ్మనైపోయా
చేతగాని వాడినయ్యి… ఓటమిలో మునిగిపోయి
అవమానంతో నేనే బీడుబారి మోడునయ్యా
చేతగాని వాడినయ్యి… ఓటమిలో మునిగిపోయి
అవమానంతో నేనే బీడుబారి మోడునయ్యా
అల్లుకున్న ఈ బంధమే
వల్లకాడు చేరుతుంటె
నా వల్ల కాదు అంటు
తల్లడిల్లిపోతుంటే
నీ సౌఖ్యం నీదంటు
ఏకాకిగ నన్ను చేశావ్
హృదయాన్నే పగులగొట్టి
శోకం కానలో వేశావ్
Allukunna Ee Bandhame Song Lyrics Credits
Operation Raavan – | |
Director | Venkata Satya |
Producer | Dhyan Atluri |
Singer | Sandilya Pisapati |
Music | Saravana Vasudevan |
Star Cast | Rakshit Atluri, Sangeerthana |
Song Label & Source | Aditya Music |