Amma Paata Lyrics penned by Mittapalli Surender, music composed by Rajeev Raj & Srikanth M, and sung by Sivani Ch from the Telugu movie ‘రాక్షస కావ్యం‘.
Amma Paata Credits
Raakshasa Kaavyam Released Date – 06 October 2023 | |
Director | Sriman Keerthi |
Producers | Damu Reddy, Singanamala Kalyan |
Singers | Sivani Ch, Master Mayukh Velagapudi |
Music | Rajeev Raj, Srikanth M |
Lyrics | Mittapalli Surender |
Star Cast | Abhai Naveen, Anvesh Michael, Rohini Aretty Kushalini |
Music Label |
Amma Paata Lyrics
Ninginai Ninnu Choosthunta
Nelapai Ninnu Mosthunta
Gaalinai Jola Paatavutha
Vennelai Ninnu Laalisthaa
నింగినై నిన్ను చూస్తుంటా
నేలనై నిన్ను మోస్తుంటా
గాలినై జోల పాటౌతా
వెన్నెలై నిన్ను లాలిస్తా
నిదరలో కమ్మని
కలలలో కధలని
కన్నా నీకు చెప్పుతూ
ఉంటా నేను తోడుగా
వెలుతురై నుదురుపై నేను
వేల వేల ముద్దులిస్తాను
ఒక్కడై నువ్వలా
ఎక్కడా నడిచినా
నీడలా నీవెంటే ఉంటా
నిన్నిలా వదిలి నే వెళ్లిపోలేదురా
దిక్కులై నిన్ను చూస్తున్నా
గుడిసెలో తడికలే
నా రెండు చేతులై
ఎప్పుడూ నిన్ను కాచుకుంటా
గడపనే దాటగా
తిరిగి నీ రాకకు
వాకిలై ఎదురుచూస్తుంటా
అమ్మా అని పిలిచినా
అమ్మా నువ్ పలకవేం
అమ్మా నాపై కోపమా
అమ్మా అని లేపినా
అమ్మా నువ్ కదలవేం
అమ్మా నీ కళ్ళు తెరువవేం
అమ్మ నీ జోలలో నేను
లోకమే మరిచిపోయాను
అమ్మ నీకోసమై నేను
వేకువై మేలుకున్నాను