మల్లెమాల ప్రొడక్షన్ తో విభేదించి వచ్చిన మెగా బ్రదర్ నాగబాబు ‘జబర్దస్త్’ తరహాలనే జీ తెలుగు ఛానెల్ లో ‘అదిరింది’ పేరుతో మరో షో స్టార్ట్ చేశారు. టీవీ నటి సమీర యాంకర్ చేస్తుండగా నాగబాబు మరియు నటుడు నవదీప్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.
‘జబర్దస్త్’ కు పోటీగా వచ్చిన ‘అదిరింది’ రేటింగ్ పరంగా కాస్త వెనకబడే ఉంటుంది. అయితే భారీ స్థాయిలో ప్రారంభించిన ఈ షో అనుకున్నంత క్లిక్ అవలేదు. ముఖ్యంగా సమీరా యాంకరింగ్ మీద కామెంట్స్ బాగానే వస్తున్నాయి. ‘జబర్దస్త్’ కన్నా ఎక్కువ పాపులారిటీ సంపాదించాలనుకున్న ఆ షో నే ఎక్కువ మంది చూస్తున్నారట. అందుకు సమీరా యాంకరింగ్ కూడా ఒక కారణమని లోడ్ చేసిన వీడియోల కింద కామెంట్ల ద్వారా తెలుసుకున్న నిర్వాహకులు కొత్త యాంకర్ కాదు యాంకర్లను తీసుకొచ్చారు.
జనాలలో బాగా పాపులారిటీ ఉన్న యాంకర్ రవికి తోడుగా బిగ్ బాస్ ఫేమ్ ‘భాను శ్రీ’ లను తీసుకొచ్చింది జీ తెలుగు. వీళ్ళ యాంకరింగ్ కి కంటెస్టెంట్ల స్కిట్టులతో అదరగొట్టాలని భావిస్తుంది. సీనియర్లు వేణు, ధన్ రాజ్, చమ్మక్ చంద్ర, ఆర్పీ లకు గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా ఎక్కువ మంది వీక్షిస్తుంది సద్దాం, యాదమ్మ రాజు ‘గల్లీ బాయ్స్’ స్కిట్స్.
11వ ఎపిసోడ్ నుండి వీరిద్దరూ ‘అదిరింది’ షోకు యాంకరింగ్ చేయనున్నారు. యాంకర్ రవి మరియు భాను లు కలిసి ఒకే వేదికను పంచుకోవడం తొలిసారి కావడం కూడా షోకు కలిసొస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ విషయం కొన్ని ఎపిసోడ్లు అయితే గాని తెలియదు. సో, అల్ ది బెస్ట్ ‘అదిరింది’.