Home » Love Failure Songs » Anitha Naa Anitha Part 2 Song Lyrics – లవ్ ఫెయిల్యూర్ సాంగ్

Anitha Naa Anitha Part 2 Song Lyrics – లవ్ ఫెయిల్యూర్ సాంగ్

by Devender

Anitha Naa Anitha Part 2 Song Lyrics మరియు పాట పాడినది గునిపర్తి నాగరాజు, సంగీతం అందించినవారు రవి కళ్యాణ్. అనిత ఓ అనిత పాటకు రెండవ భాగమే ఈ పాట.

Anitha Naa Anitha Part 2 Song Credits

SingersGuniparthi Nagaraju, Divya Malika
MusicRavi Kalyan (Ala Ravi)
Lyrics‘Anitha’ Nagaraju
CastAkshith Marvel, Vaishnavi Soni, Vaanya Aagarwal
Music LabelMY FIRST SHOW

Anitha Naa Anitha Part 2 Song Lyrics

నా ప్రాణమా… నిను మరిచిపోనులే
ఊపిరాగినా నీ మీద ప్రేమ చావదే
ఎన్నాళ్ళవుతుందో నిను చూడాక నా మనసే
నే చచ్చేవరకైనా
నా కోసం నువ్వు వస్తావా? అనిత

అనితా అనితా… నా అనితా
నా ప్రాణమైన అనితా
మరు జన్మే ఒకటుంటే
నీకై మళ్ళీ పుడతా…

నా ప్రాణమా… నిను మరిచిపోనులే
ఊపిరాగినా నీ మీద ప్రేమ చావదే

నీ పేరునే తలుచుకొని క్షణమంటూ లేదే
నిన్నే నే తలచుకునే రోజాంటూ ఇక రాదే
గుడిలో దేవత ఉందో లేదో తెలియదు గాని
నా గుండె గుడిలోన… దేవతవే నీవమ్మా

అందమైన… ఈ జ్ఞాపకాలనీ
విధి వరమంటూ… నే స్వాగతించనా

ఏ ఆశ ఇంకా లేనే లేదే
నా గుండెలోన బాధ నీవే
నీ మీద ఉన్న పిచ్చి ప్రేమే
నన్నింకా వెంటాడెనే… అనిత

అనితా అనితా… నా అనితా
నా ప్రాణమైన అనితా
మరు జన్మే ఒకటుంటే
నీకై మళ్ళీ పుడతా…

నా ప్రాణమా… నిను మరిచిపోనులే
ఊపిరాగినా నీ మీద ప్రేమ చావదే

ఏ దేవుడు రాశాడో… మన ప్రేమ కథను
ఎపుడు కలవని రాతను రాశాడు చూడు
కలనైనా ఇలనైన… మన ప్రేమే ఓ చరితం
కథ గాదు నిజమిదే… ప్రతి ప్రేమికుడికి అంకితం

నీ మీదనే… నా ఈ ప్రాణం
నీకోసమే… నే పాడే గానం

ప్రతి జన్మకి… నువ్వు నా దానివి
నన్ను కాదన్నా… నేను నీ వాడిని
నువ్వు బాగుంటే చాలంది నా మది
లోకాన్నే విడిచేళ్తున్న… అనిత

అనితా అనితా… నా అనితా
నా ప్రాణమైన అనితా
మరుజన్మే ఒకటుంటే
నీకై మళ్ళీ పుడతా…

నా ప్రాణమా… నన్నే క్షమించవా
ఈ జన్మకి… నిను కలవలేనికా
పదే పదే నా మనసు
నువు కావాలనుకున్నా
నీకోసం కనుపాపే
కన్నీరే పెడుతున్న… ప్రాణం

ప్రాణం ప్రాణం… నా ప్రాణం
నీ మీదే… నా ప్రాణం
నీకోసం నే రాలేక
నలిగింది హృదయం

నన్నే వీడి వెళ్ళావా
తిరిగిరాని దూరం
నా వల్లే ఈ గోరం
నిన్ను తలచి తలచి
తల్లడిల్లెను ప్రాణం
నిన్ను తలచి తలచి
తల్లడిల్లెను ప్రాణం
ఒట్టేసి చెబుతున్న నీకై
నే మళ్ళీ వస్తా, ప్రాణం

ప్రాణం ప్రాణం… నా ప్రాణం
నీ మీదే… నా ప్రాణం
నీకోసం నే రాలేక
నలిగింది హృదయం

Watch అనితా నా అనితా Video Song

You may also like

Leave a Comment