Aranya Teaser Out – ‘అరణ్య’ టీజర్ రానా సరికొత్త పాత్రలో

Aranya Teaser

Aranya Teaser Out – ‘అరణ్య’ టీజర్

Aranya Teaser (‘అరణ్య’ టీజర్): రానా మూడు భాషల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘అరణ్య’. సరికొత్తగా డీగ్లామర్ పాత్రలో నటిస్తున్న రానా ఈ చిత్రంలో అద్భుతంగా కనిపిస్తున్నాడు. హిందీలో ‘హాథీ మేరే సాథీ’, కన్నడలో ‘కాదన్‌’ పేరుతో వస్తున్న ఈ చిత్రానికి ప్రభు సోలోమన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.

తాజాగా విడుదల చేసిన చిత్ర టీజర్ ఆకట్టుకుంటుంది. గజరాజులను కాపాడే ఆదివాసీ వ్యక్తిగా రానా కనిపించనున్నట్టు అరణ్య
టీజర్ చూస్తే తెలుస్తుంది.  రానా దగ్గుబాటితో పాటు ఈ సినిమాలో విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియా పిల్గావ్కర్ లు ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు.

శాంతను మొయిత్రా, ఎఆర్ అశోక్ కుమార్ సినిమాటోగ్రఫీ మరియు రసుల్ పూకుట్టి సౌండ్ డిజైన్ టీజర్‌లో అద్భుతంగా కనిపిస్తున్నాయి.

థాయిలాండ్, కేరళ మరియు ఇతర ప్రదేశాలలోని దట్టమైన అడవుల్లో సుమారు 150 రోజుల పాటు చిత్రీకరించారు ‘అరణ్య’ చిత్రాన్ని. ఏప్రిల్‌ 2న ఈ సినిమా విడుదల కానుంది.

Watch Aranya Teaser – ‘అరణ్య’ టీజర్

Watch Also: సోలో బ్రతుకే సో బెటర్‌ థీమ్ వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *