Arugu Meedha Song Lyrics కాసర్ల శ్యామ్ రచించారు. జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న గేమ్ చేంజర్ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా దర్శకుడు శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ అభిమానుల అంచనాలను పెంచాయి. ఇప్పటి వరకు విడుదల చేసిన పాటలు కూడా అలరిస్తుండగా, అరుగు మీద మెలోడీ పాటను థమన్ మరియు రోషిణి ఆలపించగా, థమన్ బాణీలు అందించారు.
Arugu Meedha Song Credits
Movie | Game Changer (10-01-2025) |
Director | Shankar |
Producers | Dil Raju, Shirish |
Singers | Thaman S, Roshini JKV |
Music | Thaman S |
Lyrics | Kasarla Shyam |
Star Cast | Ram Charan, Kiara Advani |
Music Label & Source | Saregama Telugu |
Arugu Meedha Song Lyrics
అలికి పూసిన అరుగు మీన
కలికి సుందరినై కూసుంటే
పలకరించావేందీ ఓ దొరా..?
సిలక ముక్కు సిన్నీ నా దొరా…
ఎతికి చూస్తే ఏడూళ్ళైనా
నీలాంటోడు ఇక దొరికేనా..?
ఎందుకింత ఉలుకూ ఓ దొరా
ఎండి బంగారాల నా దొరా…
సైకోలెక్కి సందమామ
సిక్కోలంతా ఎన్నెల పంచి
సిన్నబోయి వచ్చావేంది..?
నీలో ఉన్న మచ్చను తలచి
కొండ నిండ వెలుగే నీదిరా…!!
మనసు మీద మన్నేయకురా
నిమ్మలముండు దొర
నా గుండె మీద వాలిపోరా
ఊపిరి పోస్తా దొరా
మనసు మీద మన్నేయకురా
నిమ్మలముండు దొర
నా గుండెలోన తప్పెట గుళ్ల
సప్పుడు నువ్వే దొరా
అలికి పూసిన అరుగు మీన
కలికి సుందరినై కూసుంటే
పలకరించావేందీ ఓ దొరా..?
సిలక ముక్కు సిన్నీ నా దొరా…
గుట్ట గుట్ట తిరిగే ఓ గువ్వ
నీకు దిష్టి పూసలాంటిది సిరిమువ్వ
ఓయ్ రాజా… నెల రాజా, ఆ ఆ
ఎంత కట్టమైన గాని నీ తోవ
నన్ను రెక్కలల్లో సుట్టుకోవా..!
సింతపూలా ఒంటి నిండా
సిటికెడంత పసుపు గుండా
సిన్నదాని సెంపల నిండా
ఎర్ర ఎర్ర కారంగుండా
వన్నెలన్నీ నీవే సూర్యుడా, ఆ ఆ
మనసు మీద మన్నేయకురా
నిమ్మలముండు దొర
నా గుండె మీద వాలిపోరా
ఊపిరి పోస్తా దొరా…
మనసు మీద మన్నేయకురా
నిమ్మలముండు దొర
నా గుండెలోన తప్పెట గుళ్ల
సప్పుడు నువ్వే దొరా