Ayudha Pooja Telugu Song Lyrics రామజోగయ్య శాస్త్రి అందించగా అనిరుధ్ రవిచందర్
సంగీత దర్శకత్వంలో కాల భైరవ పాడిన ఈ పాట ‘దేవర’ తెలుగు సినిమాలోది.
Ayudha Pooja Telugu Song Credits
Movie | Devara Part-1 (27 September 2024) |
Director | Koratala Siva |
Producers | Sudhakar Mikkilineni, Kosaraju Harikrishna |
Singer | Kaala Bhairava |
Music | Anirudh Ravichander |
Lyrics | Ramajogayya Sastry |
Star Cast | Jr NTR, Janhvi Kapoor |
Song Label | T-Series Telugu |
Ayudha Pooja Telugu Song Lyrics
ఎర్రటి సంద్రం ఎగిసిపడే
అద్దరి ఇద్దరి అద్దిరిపడే హోరు
రణధీరుల పండగ నేడు
హే కత్తుల నెత్తుటి అలల తడే
ఉప్పెన పెట్టుగ ఉలికిపడే జోరు
మన జట్టుగ ఆడెను సూడు…
హే ఉప్పూగాలే నిప్పుల్లో సెగలెత్తే
హే డప్పూమోతలు దిక్కుల్లో ఎలుగెత్తే
పులిబిడ్డల ఒంట్లో పూనకమే మొలకెత్తే
పోరుగడ్డే అట్టా శిరసెత్తి శివమెత్తె
హైలా హైల ఇయ్యాల
ఆయుధ పూజ చెయ్యాలా
జబ్బలు చరచాలా
జరుపుకోవాలా జాతర
వీరాధి వీరుల జాతి తిరణాల
ఉడుకు రకతాలా
హారతులియ్యాలా రార ధీర, హో
ధీర, హో…
హైల, ఇది అలనాటి ఆచారమే
ఇదిలా కొనసాగందే అపచారమే
బతుకే నేడు రణమైన పరివారమే
కడలి కాలం సాక్ష్యమే…
మన తల్లుల త్యాగాలే
చనుబాలై దీవించే
కనుకే ఈ దేహం
ఆయుధమై ఎదిగింది
తల వంచని రోషాలే
పొలిమేరలు దాటించే
మన తాతల శౌర్యం
చరితలుగా వెలిగింది…
ఏటేటా వచ్చే ఈ రోజే మన కోసం
మెలితిప్పిన మీసం
మనమిచ్చే సందేశం
హైలా హైల ఇయ్యాల
ఆయుధ పూజ చెయ్యాలా
జబ్బలు చరచాలా
జరుపుకోవాలా జాతర
వీరాధి వీరుల జాతి తిరణాల
ఉడుకు రకతాలా
హారతులియ్యాలా రార ధీర, హో
ఎర్రటి సంద్రం ఎగిసిపడే
అద్దరి ఇద్దరి అద్దిరిపడే హోరు
రణధీరుల పండగ నేడు
హే కత్తుల నెత్తుటి అలల తడే
ఉప్పెన పెట్టుగ ఉలికిపడే జోరు
మన జట్టుగ ఆడెను సూడు…