Bigg Boss 4 Telugu Contestants List With Photos. ఈరోజు నుండి తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సరికొత్తగా ముస్తాబై వస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ 4. అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షో ఈరోజు ఆదివారం సెప్టెంబర్ 6 సాయంత్రం 6 గంటలకు మా టీవీ లో ప్రసారం కానుంది.
ఈ సీజన్లో పాల్గొనే 16 మంది పోటీదారులు నాగార్జున పరిచయం చేసి బిగ్ బాస్ ఇంటిలోకి పంపించనున్నాడు. ఈసారి పాల్గొనే కంటెస్టెంట్లను పరిశీలిస్తే బుల్లి తెర, వెండి తెర నటులు, సోషల్ మీడియాలో తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న కొందరు ఈ లిస్ట్ లో ఉన్నారు. వారి వివరాలు ఒకసారి చూద్దాం.
Bigg Boss 4 Telugu Contestants List With Photos
1. Devi Nagavalli
పెద్దగా పరిచయం లేని పేరు జర్నలిస్ట్ దేవి నాగవల్లి. ప్రముఖ వార్త ఛానల్ టీవీ9 న్యూస్ రిపోర్టర్ తను. కామర్స్ లో బాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన దేవి స్వస్థలం రాజమహేంద్రవరం, ఆంధ్రప్రదేశ్.
2. Noel Sean
గాయకుడు, రాపర్, బుల్లి తెర/ వెండి తెర నటుడు, వీజె, ఆర్జే. ఒక ప్రముఖ FM ఛానల్ నందు ఆర్జే గా పనిచేసిన నోయెల్ తెలుగు రాపర్ గా ప్రసిద్ధి. బిగ్ బాస్ 3 విజేత రాహుల్ కి మంచి దోస్తు, అలాగే ఆ షో లో రాహుల్ కు మద్దతుగా బిగ్ బాస్ స్టేజ్ కి కూడా వచ్చాడు. ఈసారి మాత్రం తనే హౌస్ లోకి వెళ్లి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.
3. Amma Rajasekhar
ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు అమ్మ రాజశేఖర్ (అరుముగం రాజశేఖర్) ఈసారి తెలుగు బిగ్ బాస్ లో పాల్గొననున్నాడు. టీవీ ల్లో ప్రసారం అయిన పలు డాన్స్ షో లకు జడ్జిగా తెలుగు వాళ్లకు సుపరిచితులు రాజశేఖర్ మాస్టర్.
4. Surya Kiran
రచయిత, దర్శకుడు, నిర్మాత సుబ్రమణి రాధా సురేష్ (సూర్య కిరణ్). సత్యం, ధన 51, రాజు భాయ్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి, సొంతంగా కొన్ని చిత్రాలను నిర్మించినా అవి అతనికి కలిసి రాలేదు. తిరిగి సినిమా దర్శకత్వం వహించే పనిలో ఉన్నాడు. అతను దాదాపు 200 చిత్రాల వరకు బాలనటుడిగా పలు దక్షిణాది చిత్రాల్లో కనిపించాడు.
5. Gangavva
మిల్కూరి గంగవ్వ (గంగవ్వ) అంటే తెలియనోళ్లు ఉండరేమో. యూట్యూబ్ సెన్సేషన్ అయిన గంగవ్వ బీడీలు చుడుతూ, వ్యవసాయం చేస్తూ తెలంగాణ యాస బాష తో అందరిని ఆకట్టుకుంది. ఇస్మార్ట్ శంకర్, మల్లేశం వంటి చిత్రాల్లో కూడా నటించింది. మొదటిసాటి ఒక రియాలిటీ షో లో పాల్గొనే అవకాశం దక్కింది బిగ్ బాస్ 4 ద్వారా.
6. Divya Vadthya – Divi
హైదరాబాదీ అమ్మాయి అయినా దివ్య మహేష్ బాబు, పూజ హెగ్డే చిత్రంలో నటించింది. ఎంబీఏ పూర్తి చేసుకున్న దివ్య బిగ్ బాస్ విజేతగా నిలిచి స్టార్ కావాలని ఆశిస్తుంది.
7. Dethadi Harika
ఉత్సాహం ఉరకలేసే తెలంగాణా అమ్మాయి యూట్యూబర్లకు పరిచయం అస్సలు అవసరం లేని పేరు దేత్తడి హారిక. డిగ్రీ పూర్తి చేసుకున్న హారిక అనుకోకుండా ఈ ఫీల్డ్ లోకి వచ్చి తానేంటో నిరూపించుకుంది. సోషల్ మీడియాలో తనకున్న ఫాలోయింగ్ తనను బిగ్ బాస్ తెలుగు 4 విజేతను చేయాలని ఆశిద్దాం.
8. Lasya Manjunath
2012 లో యాంకర్ రవితో కలిసి ‘సమ్థింగ్ స్పెషల్’ షో ద్వారా టీవీ పరిశ్రంలోకి వచ్చి తనకంటూ ఒక ముద్ర వేసుకున్న యాంకర్, నటి లాస్య ఈసారి బిగ్ బాస్-4 లో పాల్గొననుంది. పెళ్లి తర్వాత కొంత గ్యాప్ తీసుకొని ఇప్పుడిప్పుడే పలు టీవీ షో ల్లో దర్శనమిస్తుంది.
9. Abhijeet Duddala
శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు అభిజీత్. ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా బుల్లి తెరకు పరిచయం అవుతున్నాడు.
10. Karate Kalyani
పడాల కల్యాణి కమెడియన్ గా అందరికి సుపరిచితమే. నటి, మార్షల్ ఆర్టిస్ట్ అయిన కళ్యాణి న్యూస్ ఛానల్ లో డిబేట్ లకు తరచూ హాజరవుతూ ఉంటుంది. అలాగే పలు తెలుగు సీరియల్ లలో కూడా నటిస్తుంది. ఫైర్ బ్రాండ్ గా పేరున్న కళ్యాణి కచ్చితంగా ఒక మంచి కంటెస్టెంట్ గా భావిస్తున్నారు.
మిగతా హౌస్ మేట్స్ లిస్ట్….