మరోసారి భారత్ లాక్‌డౌన్ పొడిగింపు. కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండియాలో లాక్‌డౌన్ ను
మూడోసారి పొడిగించింది. లాక్‌డౌన్ రెండు వారాలపాటు అంటే మే 17 వరకు కొనసాగిస్తున్నట్టు కాసేపటి క్రితమే కేంద్ర హోం
మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మే 3 వరకు ఉన్న లాక్‌డౌన్ ఇప్పుడు మే 4 నుండి మే 17 వరకు కోనసాగనుంది.
ఇందుకు సంబంధించి కొన్ని సడలింపులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం గ్రీన్, రెడ్, ఆరంజ్ జోన్ల వారీగా. గ్రీన్ మరియు ఆరంజ్ జోన్లలో కొన్ని సడలింపులు ఇవ్వగా రెడ్ జోన్లలో మాత్రం ఏలాంటి సడలింపులు లేకుండా లాక్‌డౌన్ కఠినంగా కొనసాగనుంది.
దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఈ కీలక
నిర్ణయం తీసుకోక తప్పలేదు. మార్చి 25 నుండి భారత్ లో లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
రెండో దఫా లాక్‌డౌన్ మే 3 తో ముగియనుంది. ఇదే విషయమై రేపు (మే 2) ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ఉదయం 10 గంటలకు మాట్లాడనున్నారు.
తెలంగాణాలో రెండో దఫా లాక్‌డౌన్ మే 7 ముగియనుండగా మరో రెండు రోజుల్లో జరిగే మంత్రి వర్గ సమావేశంలో ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకోనుంది.
Ministry of Home Affairs has issued an order under the Disaster Management Act, 2005 to further extend the #lockdown for a further period of two weeks beyond May 4 pic.twitter.com/o0ubQUx9m3
— ANI (@ANI) May 1, 2020