చిరంజీవి 152వ సినిమా టైటిల్ ఏంటి, ఎప్పుడు రివీల్ చేస్తారు అని అనుకుంటున్న మెగా అభిమానులకు చిరంజీవి స్వయానా
టైటిల్ పేరు ప్రకటించడం విశేషం. అయితే ఇది కావాలని చెప్పింది కాదు. ‘ఓ పిట్టకథ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లిన మెగాస్టార్
చిరంజీవి మాట్లాడుతూ ఒక్కసారిగా కొరటాల శివతో తాను చేస్తున్న 152వ సినిమా పేరు ‘ఆచార్య’ అని చెప్పేశాడు.
బ్రహ్మాజీ తనయుడు హీరోగా వస్తున్న ‘ఓ పిట్టకథ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కాస్త చిరంజీవి 152వ చిత్ర టైటిల్ తెలుసుకునే వేదికగా మారింది. అలా టైటిల్ చెప్పగానే ఒక్కసారిగా ఈవెంట్ లో ఉన్న అందరూ ఈలలు, చప్పట్లు చేస్తుంటే చిరంజీవి షాక్ అయ్యాడు. ఏంటి టైటిల్ చెప్పలేదా ? అని కొంచెం సేపు మౌనంగా ఉన్నారు.. అక్కడే స్టేజిపైన ఉన్న సందీప్ కిషన్, బ్రహ్మాజీ, ఉత్తేజ్ తదితరులు సంతోషంగా చప్పట్లు కొట్టారు.
ఇక తేరుకొని మాట్లాడిన చిరు ‘ఎక్కడ మిస్ అయ్యానో తెలియడం లేదు, కొరటాల శివ గారు ఒక ప్రోగ్రాం పెట్టుకొని అందంగా
లాంచ్ చేద్దాం అనుకున్నారు, టైటిల్ లాంచ్ నా నోటి ద్వారా వెళ్ళిపోయింది. సారీ శివ గారు ఏమనుకోవద్దు.. మంచి మంచి వార్తలు ఆపుకోలేము, ఆపడం కరెక్ట్ కూడా కాదు’ అని చెప్పుకొచ్చారు.
అయితే కొరటాల శివ-చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబు నటిస్తున్నారని అనుకుంటున్నా ఇప్పటికీ ఇంకా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు.