చిరు 152వ చిత్రం ఫోటో లీక్ – సోషల్ మీడియాలో వైరల్

చిరు 152వ చిత్రం ఫోటో లీక్

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఇంకా పేరు పెట్టని ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఇందులో భాగంగా చిరంజీవికి సంబందించి కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ మొదలై కొన్ని రోజులకె సినిమాకు లీకుల బెడద పట్టుకుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న లీకులు వెలువడడం చిత్ర బృందాన్ని కలవరబెడుతుంది. ప్రస్తుతం చిరు, కొరటాల 152 సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది.

మెడలో ఎర్ర కండువా వేసుకొని ఆలివ్ గ్రీన్ షర్ట్ ను మోచేయి వరకు మడిచి బ్లాక్ డెనిమ్ ధరించి దర్జాగా నిల్చున్న ఫోటో ఆన్ లైన్ లో చెక్కర్లు కొడుతోంది. అయితే ఈ చిత్రంలో చిరంజీవి పాత్ర గురించి రూమర్లు కూడా అదే స్థాయిలో చెక్కర్లు కొడుతున్నాయి. కొందరు నక్సల్ పాత్ర పోషిస్తున్నాడని, కొందరు ధర్మాదాయ దేవాదాయ శాఖలో పనిచేస్తూ అందులో అవినీతికి వ్యతిరేకంగా పోరాటం ఉంటుందని చెప్తున్నారు. లీక్ అయినా ఫోటో చూస్తుంటే మాత్రం నక్సలైట్ అని ప్రేక్షకులు నిర్దారించుకునేందుకు అవకాశం అయితే ఉంది.

రామ్ చరణ్ ఈ సినిమాలో చిరంజీవి చిన్ననాటి పాత్రను పోషిస్తున్నారని ముందుగా అనుకున్నారు. అయితే రాజమౌళి చిత్రం ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ ఆలస్యం అవడంతో చిరంజీవి 152వ చిత్రంలో నటించడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తుంది. అనధికార సమాచారం ప్రకారం ఈ పాత్రకోసం సరిపోయే నటుని కోసం వెతుకుతున్నారు. దీనికి అల్లు అర్జున్ సరిపోతాడని చిత్ర బృందం భావిస్తున్నట్టు తెలుస్తుంది. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతుంది. త్రిష కథానాయిక.

చిరు 152వ చిత్రం ఫోటో లీక్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here