Chitralahari Movie Dialogues penned by director Kishore Tirumala Garu.
చిత్రలహరి సినిమా డైలాగ్స్
Cinema Name | Chitralahari (12 April 2019) |
Writer & Director | Kishore Tirumala |
Producers | Naveen Yerneni, Y. Ravi Shankar and Mohan Cherukuri |
Star Cast | Sai Tej, Kalyani Priyadarshan, Nivetha Pethuraj |
Audio Juke Box |
Listen @Sony Music South – Click Here
|
Check Chitralahari Movie Songs Lyrics |
Chitralahari Movie Dialogues
✦ హీరో ఫ్రెండ్: బాధపడకు బాబాయ్, నీకో మంచి రోజొస్తుంది.
✦ హీరో: ఆ వచ్చేదేదో ఆదివారం పూట రమ్మని చెప్పు బాబాయ్, ఇంటి దగ్గర ఖాళీగా ఉంటాను.
✦ హీరో: బాటమ్ అఫ్ మై హార్ట్ నీకు చెప్తున్నాను లహరి… నాలుగు నెలల ఈ ట్రావెల్ లో నా మైండ్ లో పరిగెట్టడం వల్ల నువ్వు అలసిపోయి ఉంటావేమో గాని, ఏ రోజు ఏ క్షణం నేను అలసిపోలేదు.
✦ బ్రతకడం అంటే చివరి వరకు ప్రాణాలతో ఉండడం కాదు… ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన అమ్మాయితో ఉండడం.
✦ హీరో: నా ఆటేదో నేనే ఆడతాను.. ఓటమైన గెలుపైనా నాదే కావాలి. నా తరుపున నువ్వాడక్కర్లేదు.
✦ హీరో: నాకు నిన్ను ఇబ్బంది పెట్టడం తెలియదు లహరి, ఇష్టపడడం మాత్రమే తెలుసు.
✦ హీరో: లవ్ చేసే ముందు friendship అంటే ఓకే, లవ్ చేశాక ఒక relationship లో ఉండి లైఫ్ మొత్తం ఊహించుకున్న తరువాత, Let’s Be Good Friends అంటే ఎలాగ..? How does it make sence Lahari.
✦ హీరో: జాబ్ లో ఎలాగూ ఇవే సిట్యువేషన్స్ పేస్ చేస్తున్న, కనీసం లవ్ లో అయినా ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటే, ఇక్కడ కూడా నువ్వు ఇలా అంటే నాకు ఓపిక లేదు.
నా ఉద్దేశ్యంలో లవ్ అంటే నమ్మకం, అదే లేదంటే లవ్ లేనట్టే. రేపు పొద్దున నీకోసం నేను షాజహాన్ లా తాజ్ మహల్ కట్టినా, కట్టింది కూలీలే కదా, ఇందులో నీ ప్రేమెలా కనిపిస్తుంది అని అడుగుతావ్.
✦ లహరి: నేను వెళ్తాను…
హీరో: నువ్వెళ్ళిపోయి చాలాసేపయింది.
✦ హీరో ఫ్రెండ్: ప్రేమ అనేది తలమీద జుట్టు లాంటిది. అది ఉండాలనుకుంటే సాంపిల్ సోప్ వాడినా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఒక్కసారది ఊడాలని డిసైడ్ అయ్యాక లక్ష పెట్టి షాంపూ వాడినా నో యూజ్. So Hair & Love Are Not In Our Hands.
✦ హీరో: వాళ్ళ ప్రేమకి మన ప్రేమకి తేడా ఏంటో తెలుసా, వాళ్ళు పనులన్నీ చూసుకొని ఖాళీగా ఉన్నప్పుడు మనల్ని లవ్ చేస్తారు… కాని మనం, పనులన్నీ మానేసుకొని వాళ్ళని ప్రేమించడమే పనిగా పెట్టుకుంటాం.
✦ హీరో: సంవత్సరం ముందు పరిచయమయి సగంలో వదిలేసి వెళ్లిపోయిన తనకే… ఫోనుల్లోనూ, మెసేజ్‌లోనూ కలిసిన ప్రతిసారి కొన్ని వందల సార్లు చెప్పుంటాను నాన్న… ఐ లవ్ యు అని…
అమ్మ చనిపోయినా తను బ్రతికుంటే బాగున్ను అనే ఆలోచన కూడా రానివ్వకుండా, ఓడిపోతున్న ప్రతిసారి నన్ను సపోర్ట్ చేస్తూ, చివరికి ఇంటికి తాగొస్తే… తిట్టకపోగా, అన్నం పెట్టి, ఆమ్లెట్ వేసుకొచ్చిన నీకు కదా నాన్న చెప్పాలి… ఐ లవ్ యు.
✦ హీరో తండ్రి: కెరీర్ కంటే ఏదీ ఇంపార్టెంట్ కాదు, దానికివ్వాల్సిన ఇంపార్టెన్స్ దానికిస్తే, మనకివ్వాల్సిన ఇంపార్టెన్స్ ఆటోమేటిక్ గా అది మనకిస్తుంది.
✦ హీరో తండ్రి: స్విగ్గీలో పెట్టిన ఆర్డరా? ఇంట్లో కూర్చుంటే గంటలో రావడానికి… సక్సెస్… టైం పడుతుంది.
✦ హీరో: లహరి నువ్వు కావాలనుకున్నప్పుడు నిన్ను చూడడం కంటే, నువ్వు వద్దనుకుంటున్నప్పుడు నిన్ను చూస్తుంటేనే ప్రేమంటే ఏంటో పూర్తిగా అర్ధమవుతుంది.
✦ హీరో: తను లేదని పూర్తిగా తెలిస్తే డోర్ క్లోజ్ చేసెయొచ్చు, వస్తుందన్న హోప్ ఉందంటే ఓపెన్ చేసుండొచ్చు… My situation is like, గాలికి తెరచిన డోర్… క్లోజ్, ఓపెన్.. క్లోజ్, ఓపెన్… టపా టపా కొట్టుకుంటుంది.
✦ హీరో: దగ్గరినుండి చూడకుండా దూరం నుండి చూసి… ఇది రాంగ్ అని, ఇది రైట్ అని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు కదా.
✦ హీరో: ప్రేమనేది పద్మవ్యూహం లాంటిది. కుర్రాలందరూ అభిమన్యుడిలాంటోల్లం. మాకు అందులోకి ఎలా వెళ్ళాలో తెలుసు తప్పా, ఒక్కసారి లోపలికి వెళ్ళాక… అందులోంచి ఎలా బయటపడాలో, ఎవ్వరికీ తెలియదు.
✦ హీరో తండ్రి: ఒక వస్తువైనా, వ్యక్తి అయినా, కన్న కలైనా బాగోనప్పుడు, దాన్ని వదిలేసి వేరేదాన్ని పట్టుకొని వెళ్ళిపోతారు. ఇలా వదులుకుంటూ వెళ్ళిపోతే చివరికి ఏం మిగులుతోంది… ఉత్త చేతులు తప్ప. ఒక సమస్య వస్తే వదిలేయటం అనేది పరిష్కారం ఎలా అవుతుంది? నీ తప్పును నువ్వు తెలుసుకునేదానికంటే గొప్ప అచీవ్మెంట్ ఏముంటుంది.
✦ హీరో తండ్రి: ఎంత గొంతెండిపోతున్న మాత్రాన, కన్నీళ్ళతో అయితే గొంతు తడుపుకోలేం కదరా.