‘కలర్ ఫోటో’ ఫస్ట్ లుక్ ను నటుడు నాని ట్విట్టర్ వేధికగా విడుదల చేశారు. “కలర్‌ఫోటో చిత్రాన్ని ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉంది. అత్యంత ప్రతిభావంతులైన బృందం తెరకెక్కిస్తున్న ‘కలర్ ఫోటో’ కోసం నేనెంతో కుతూహలంగా ఎదురుచూస్తున్నాను”. అంటూ ట్వీట్ చేశాడు నాని.
‘కలర్ ఫోటో’ చిత్రం ద్వారా మొదటిసారి హీరోగా సుహాస్ వెండి తెరకు పరిచయం అవుతున్నాడు. చాందిని చౌదరి కథానాయికగా
నటించనుంది. చిత్రానికి సందీప్ రాజ్ (మసాల సందీప్) దర్శకత్వం వహిస్తుండగా బెన్నీ ముప్పలనేని మరియు సాయి రాజేష్
నీలం సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాల భైరవ సంగీతాన్ని అందించనున్నారు.
విలన్ గా సునీల్
కమేడియన్ గా, హీరోగా రాణించిన నటుడు సునీల్ ‘కలర్ ఫోటో’ చిత్రం ద్వారా విలన్ గా మారనున్నారు. విలన్ గా సునిల్ ఏమాత్రం ఆకట్టుకుంటారో తెలియాలంటే కొంత కాలం ఎదురు చూడాలల్సిందే.
Very happy to announce this charming film #ColourPhoto . With this extremely talented gang working on it am so looking forward to this one . I know the boys will rock already 😊@MasalaSundeep @ActorSuhas @kaalabhairava7 @iChandiniC @Mee_Sunil @sairazesh, @benny_muppaneni pic.twitter.com/lqEDXHHUpa
— Nani (@NameisNani) December 29, 2019