కరోనాకు నివారణ ఇలా.. దేవరకొండతో తెలంగాణ ఆరోగ్య శాఖ ప్రచార వీడియో

ప్రజల్లో కరోనా వైరస్ (కోవిడ్19) పై అవగాహన కల్పించే పనిలో పడింది తెలంగాణ ప్రభుత్వం. భారత్ లో కూడా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో దీనిని అరికట్టేందుకు తెలంగాణ ఆరోగ్య మంత్రిత్వ శాఖ  నడుం బిగించింది. ఇందులో భాగంగానే నటుడు విజయ్ దేవరకొండ చేత ఒక వీడియో చేయించింది ప్రభుత్వం. వీడియోను కరోనా వైరస్ ఎలా అరికట్టాలో చెప్పారు.

వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన వీడియోలో నివారణా చర్యలు ఇలా ఉన్నాయి.

కరోనా వైరస్ గురించి భయపడాల్సిన పని లేదు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.

  1. పద్దతిగా నమస్కారం పెట్టండి. షేక్ హ్యాండ్ (కరచాలనం) ఇవ్వకండి
  2. తరచుగా చేతులను సబ్బుతో కడుక్కోవాలి
  3. మీ కళ్ళని, చెవిని, ముక్కును మరియు నోటిని చేతితో తాకకూడదు
  4. ఎవరైనా దగ్గుతున్నా, తుమ్ముతున్నా వారికి కనీసం మూడడుగులు దూరంలో ఉండడం మంచిది
  5. రద్దీ ప్రదేశాలకు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు
  6. ఎవరైనా వ్యాధి లక్షణాలు ఉన్నట్టు అనిపించిన వెంటనే 104 నెంబర్ కి ఫోన్ చేయగలరు

పైన తెలిపిన జాగ్రత్తలు పాటిస్తే వైరస్ భారిన పడే అవకాశాలు లేవు. చైనా ఏడ మరేతర వైరస్ ప్రభావం ఉన్న దేశం నుండి వచ్చినా తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించడమే కాకుండా ఇతరులకు అవగాహన కంపించడం అందరి బాధ్యత.

దేవరకొండతో తెలంగాణ ఆరోగ్య శాఖ ప్రచార వీడియో