Egire Guvvalagaa Song Lyrics రాకేష్ పనికెల అందించడంతోపాటు సంగీతాన్ని సమకూర్చగా సాయి చరణ్ పాడిన ఈ పాట శారీ చిత్రంలోనిది. సోషల్ మీడియా సెన్సేషన్ ఆరాధ్య దేవి ప్రధానపాత్రలో నటించిన ఈ చిత్రానికి గిరి కృష్ణ కమల్ దర్శకత్వంలో రాంగోపాల్ వర్మ ఆర్ జీ వి ఆర్వీ ప్రొడక్షన్ లో రానుంది.
Egire Guvvalagaa Song Lyrics Credits
Movie | Saaree (శారీ) |
Director | Giri Krishna Kamal |
Producer | Ravi Shankar Varma |
Singer | Sai Charan |
Music | Rakesh Panikela |
Lyrics | Rakesh Panikela |
Star Cast | Aradhya Devi, Satya Yadu |
Music Source | RGV |
Egire Guvvalagaa Song Lyrics
ఓ ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ
ఎగిరే గువ్వలాగా గాల్లో తేలిపోనా
ఎగసే అలలపైనే వాలిపోనా
తరిమే వలపు వాన
కురిసే నిదురలోనా
నిజమై నన్ను చేరి తరుముతున్నా
ఆశలే అలసిపోని తరుణం
ఆగదే అడుగు ఓ క్షణమే
నిన్నలా లేని రేపటి ఉదయం
నేడిలా ఎదురు నిలిచినదే
ఫ్రీడమ్ తో ఫైటింగే
చేసేస్తూ ఉండాలా
అనుకుంటూ సాగనా కలా
నాలో ఈ వేళ
ఓ మరియా… చల్ మస్తీ చేద్దాం దునియా
ఓ మరియా… లైఫ్ అంటే దోస్తీరా
ఓ మరియా… అలరించే అయస్కాంతమేరా
ఓ మరియా… ఈ జిందగీ నాదేరా
హేయ్, పదపదమన్నది ప్రాయం
ఎదల అలజడులాపుట సాధ్యమా
తొలకరి వలపుల మేఘం
పిలిచి పరుగులు పెడితే న్యాయమా
అలుపన్నదే మరచి
అడుగు అడుగున ఆనందం
వెతికే పయనమా
ఆ నింగే తొంగి చూడంగా
సయ్యాటల్లో మైమరచానే
ఈ పయనం ఎందాకో
తుది మొదలు ఏదో తెలుసా
ఓ మరియా… చల్ మస్తీ చేద్దాం దునియా
ఓ మరియా… లైఫ్ అంటే దోస్తీరా
ఓ మరియా… అలరించే అయస్కాంతమేరా
ఓ మరియా… ఈ జిందగీ నాదేరా
హేయ్ రంగుల హంగులది యవ్వనం
హరివిల్లుల పోతే రాదే
సుమగంధాల వారధై అనుదినం
పొందాలి అనుభవాలే
సుమధుర స్వరమే పలికే మౌనం వీడి
కథలెన్నో తరుముకొస్తుంటే
ఏ, తపనే పెరిగే తెలియని మరోలోకం
తెరలు తీస్తుంటే…
ఓ మరియా… చల్ మస్తీ చేద్దాం దునియా
ఓ మరియా… లైఫ్ అంటే దోస్తీరా
ఓ మరియా… అలరించే అయస్కాంతమేరా
ఓ మరియా… ఈ జిందగీ నాదేరా