Home » Kittu Vissapragada » First Love Telugu Song Lyrics – Sid Sriram, (మనస్సే చేజారే)

First Love Telugu Song Lyrics – Sid Sriram, (మనస్సే చేజారే)

by Devender

First Love Telugu Song Lyrics

First Love Telugu Song Credits

DirectorBala Raju M
ProducerVaishaliraj
SingerSid Sriram
MusicSanjeev. T
LyricsKittu Vissapragada
CastingDeepu Janu , Vaishaliraj
Music Label & SourceVinay Shanmukh

First Love Telugu Song Lyrics

చూసే చూసే కన్నుల్లోనే
నువ్వెనంటా ఆశల జలపాతాలే
రెక్కే విప్పి ఆడేనంటా ఓ మనసే
ఊహించలేదులే ఈ కాస్త పరిచయం
ఇచ్చోటే అదేనా ఇలా ఈ క్షణం

మనస్సే చేజారే నీ వల్లే…
పతంగై పోయిందే నీ వెంటే…
ఇదంతా కల కాదా అనిపించే ఏమో…
నమ్మాలో… ఓ, లేదో
మెరుపే మగువై ఎదురుపడితే
మనసే కరిగే మేఘంలో దాహంలా
వెనుకపడే వేగం… పెరిగిన ఈ నిమిషంలో
తరగతిలో తన గతిలో మలుపులనే
మది చెదిరే

మనసారా, ఆ ఆ… మనసారా, ఆ ఆ…
పలికిందే నా ప్రాణం
నిను కోరే… (హుషారుగా హుషారుగా)
నాలో జతగా…
కిరణంతో చిగురైనా శిశిరంలా…
(తరించిన నా ప్రేమా…)

గతమే మారే మారే
కధలో నువ్వే చేరే…
ఇకపై అన్నీ నీకే
నాదంటూ ఏమున్నా…
ఎపుడూ అనుకోలేదే
మునుపు ఏదో రోజే
ఒకరు నాతో తోడే వస్తారంటూ…
ఎదలోతులో నీపై ప్రేమనీ
పెదవంచులో మోస్తూ ఉన్నా గాని
ఒక మాటలో తెలపాలనుకున్నా…
బాషా కాదంటుందో ఏదో
స్పర్శతో మౌనాన్ని దాటే
యుద్ధమే నాలో చేస్తూ ఉన్నా, ఓ ఓ ఓ

మనసారా, ఆ ఆ… మనసారా, ఆ ఆ…
పలికిందే నా ప్రాణం
నిను కోరే… (హుషారుగా హుషారుగా)
నాలో జతగా…
కిరణంతో చిగురైనా శిశిరంలా…
(తరించిన నా ప్రేమా…)

అంతులేని ఆ సాగరంలా…
హద్దులేని నీలాకసంలా…
గుండెలోని ఈ ప్రేమనంతా
రాసివ్వనా నీ పేరా…

అంతులేని ఆ సాగరంలా…
హద్దులేని నీలాకసంలా…
గుండెలోని ఈ ప్రేమనంతా
రాసివ్వనా…

కాలమే మననే చూసి
ఓ క్షణం ఆగేలా
నిన్నతో రేపటి కోసం
దిష్టినే తీసెయ్ నా
నాకు నువ్ ఉంటే చాలు
నీకు నేనున్నాగా….
లోకమంతా ఇలాగే ఏకమవుతున్న
వీడిపోని నదీ అలల్లా ఉంటూ కడదాకా

మనస్సే చేజారే నీ వల్లే…
పతంగై పోయిందే నీ వెంటే…
ఇదంతా కల కాదా, ల ల లాలా

Watch మనస్సే చేజారే Video Song

You may also like

Leave a Comment