Home » Jakes Bejoy » Gulledu Gulledu Song Lyrics (గుల్లెడు గుల్లెడు) Mechanic Rocky

Gulledu Gulledu Song Lyrics (గుల్లెడు గుల్లెడు) Mechanic Rocky

by Devender

Gulledu Gulledu Song Lyrics సుద్దాల అశోక్ తేజ రచించగా, జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా మంగ్లీ పాడిన ఈ పాట ‘మెకానిక్ రాకీ’ చిత్రంలోనిది.

Gulledu Gulledu Song Lyrics Credits

Mechanic Rocky Movie Release Date – 31 October 2024
DirectorRavi Teja Mullapudi
ProducerRam Talluri
SingerMangli
MusicJakes Bejoy
LyricsSuddala Ashok Teja
Star CastVishwaksen, Meenakshi Chaudhary, Shraddha Srinath
Music LabelSonyMusicSouth

Gulledu Gulledu Song Lyrics

తందానే తందానే
తందానే తందానే
తందానే తందానే
తందానే తందానే

గుల్లెడు గుల్లెడు గులాబీలు… గుప్పే పిల్లడే
ఇంక నాతో ఉంటడే…
నా పైటకొంగు పాడుగాను… నిన్నే కోరెలే
నీకు గులామైతిలే…

గుల్లెడు గుల్లెడు గులాబీలు… గుప్పే పిల్లడే

నడుమూ గీరుతూ… ఒడ్డాణమై ఉంటడే
గదుమా కిందా పూసే గందమైతడే
పైటను జారకుండా… పిన్నిసైతనంటడే
రైకను ఊరడించే హుక్కులుంటడే…
ఒడిలో చేరి వాడు… వదలను పో అంటాడే
అగడు వట్టినట్టు అదుముకుంటాడే
బుగ్గ మీద సిగ్గు మీద ముగ్గోలుంటడే

వాడు…
గుల్లెడు గుల్లెడు గులాబీలు గుప్పే పిల్లడే
ఇంక నాతో ఉంటడే…
నా పైటకొంగు పాడుగాను నిన్నే కోరెలే
నీకు గులామైతిలే…

కో కో కో కోతి బావ… ఇంకా పెండ్లి చేసుకోవా
బె బె బె బెండకాయ ముదిరిపోతే దండుగయ
మాయక్క నీకు దొండపండయా… ఓ మేనబావలు
నక్క తోక తొక్కినావయా

ఆ, సన్నా సన్నా మీసమొచ్చి… యాడదన్నా గాలేదే
సూపు మీద సున్నామెయ్య… సూడనివన్ని సూత్తాడే
పాపమంటే పాలన్నీ తాగేసే… పిల్లోలే నా యంట పడుతుంటే
సూదిపట్టే సందిట్టే సాలు… సోరవడుతడే

ఏ… ఊకో మంటే ఊకోడమ్మా ఉడుం పోరడే
జిడ్డు లెక్క అంటుకోని జిద్దు జేస్తడే
అరె ఏలువతో గింతె సారు కన్నెలు కాలు జారుతారే

గుల్లానైతిరో… రసగుల్లానైతిరో
నేను కల్లాసైతిరో… కల్లుగిల్లాసైతిరో
యెహే, గుల్లానైతిరో రసగుల్లానైతిరో
నేను… కల్లాసైతిరో, కల్లుగిల్లాసైతిరో, ఓ

ఆ చబ్బీ చబ్బీ జబ్బా మీద… సబ్బు లెక్క జారిన్నే
రాయికండలోడి రొమ్ము మీదనే సోయిదప్పిన్నే
జారుకొప్పు విప్పేసి… రింగుల కురులను దుప్పటి చేసిన్నే
వీడు ఉంటే ఈడుకు ఇంకా చెడుగుడు ఆటే…

హే బాసింగాలు కట్టుకుంటే… భరోసైతడే
పిట్టముడి ఇప్పి నాకు దిట్టీ దీత్తడే
ఆని గాన్ని సోకితే సాలు… మబ్బుల తేలిపోతనులే

గుల్లానైతిరో… రసగుల్లానైతిరో
నేను కల్లాసైతిరో… కల్లుగిల్లాసైతిరో
యెహే, గుల్లానైతిరో రసగుల్లానైతిరో
నేను… కల్లాసైతిరో, కల్లుగిల్లాసైతిరో, ఓ

గుల్లానైతిరో రసగుల్లానైతిరో
నేను కల్లాసైతిరో… మందు గిల్లాసైతిరో
గుల్లానైతిరో రసగుల్లానైతిరో
నేను కల్లాసైతిరో కల్లు గిల్లాసైతిరో

నీకు కల్లాసైతిరో… మందుగిల్లాసైతిరో
నీకు కల్లాసైతిరో… కల్లుగిల్లాసైతిరో
నీకు కల్లాసైతిరో… నేనే గిల్లాసైతిరో
రసగుల్లానైతిరో… నీకు గులామైతిరో

Watch గుల్లెడు గుల్లెడు గులాబీలు Lyrical Video Song

You may also like

Leave a Comment