Haindava Sankharavam Theme Song Lyrics అనంత్ శ్రీరామ్ అందించగా, బుర్ర విఖ్యాత్ సాయిరాం సంగీత సారధ్యంలో మధుప్రియ ఈ పాట ఆలపించారు. విశ్వ హిందూ పరిషత్ ఈరోజు విజయవాడలో హైందవ శంఖారావాన్ని పూరించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని ప్రధాన డిమాండుతో విజయవాడ దగ్గరలోని కేసరపల్లిలో జరిగే భారీ బహిరంగ సభ ముఖ్య ఉద్దేశ్యం.
Haindava Sankharavam Theme Song Credits
Singer | Madhu Priya |
Music | Burra Vikhyat Sairam |
Lyrics | Ananth Sriram |
Song Label & Source | HAINDAVA SANKHARAVAM VHP |
Haindava Sankharavam Theme Song Lyrics
భం భం భం భం… హా
భం భం భం భం… హా
భం భం భం భం భళా భళా
మోగిందిర శంఖారావం
మన హైందవ శంఖారావం
హిందూ బంధువులందరొక్కటై
ముందుకేగమని భావం
మునుముందు చూపాలి ప్రభావం
భం భం భం భం భళా భళా
మోగిందిర శంఖారావం
మన హైందవ శంఖారావం
హిందూ బంధువులందరొక్కటై
ముందుకేగమని భావం
మునుముందు చూపాలి ప్రభావం
సనాతనానికి సత్తువనిచ్చే దీక్ష ధారణం
(ఘన దీక్ష ధారణం)
అఖండ భారత విజయ యాత్రకిది
శక్తి పూరణం… జనశక్తి పూరణం
భం భం… హా
భం భం భం భం… హా
భం భం భం భం భళా భళా
మోగిందిర శంఖారావం
ఇది హైందవ శంఖారావం
కుహనా లౌకికవాదులు పన్నే
కుట్రల నుంచి…
హ, కుట్రల నుంచి
విదేశీ మాధ్యమాలు రచించే
కుతంత్రాల నుంచి…
హా, కుతంత్రాల నుంచి
ఆలయాల్లో చొరబడే ఆ అన్యమతస్తులనుంచి
విధర్మ సంస్థలకమ్ముడుపోయే
స్వార్ధ నాయకుల నుంచి
భారతజాతిని, భారతజ్యోతిని
కంచుకవచమై కాపాడేందుకు…
భం భం… హా
భం భం భం భం… హా
భం భం భం భం భళా భళా
మోగిందిర శంఖారావం
ఇది హైందవ శంఖారావం
కులాలుగా విడి విడిగుంటే
విచ్ఛిన్నమౌతాం… విచ్ఛిన్నమౌతాం
హిందువులుగా ఏకమైతే
ఓ సైన్యమౌతాం… ఓ సైన్యమౌతాం
అంతకంతకు అంతరించిపోయే
ప్రమాదమెదురైనా…
ఎంతకెంతకు మేలుకోక
ఆ మత్తులోనే ఉంటామా
నిద్రలేవమని, ఉద్యమించమని
ఉగ్రరూపమై హూంకరించమని……
భం భం… హా
భం భం భం భం… హా
భం భం భం భం భళా భళా
మోగిందిర శంఖారావం
మన హైందవ శంఖారావం