తెలంగాణలో ఒంటి పూట బడులు ఈ నెల 16 (మార్చి 16, 2020) నుండి ప్రారంభం కానున్నట్టు పాఠశాల విద్యా కమిషనర్ చిత్రారామచంద్రన్ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు స్కూళ్ళ సమయం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పనిచేస్తాయి.
అయితే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఒంటి పూట బడుల సమయంలో మధ్యాహ్న భోజనం అనంతరం (12:30 గంటలకు) ఇంటికి వెళ్తారు.
తెలంగాణ రాష్ట్రంలో వేసవి సెలవులు ఎప్పటినుండి ?
వార్షిక పరీక్షల అనంతరం ఏప్రిల్ 23వ తేదీ నుండి ప్రభుత్వ పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు. 12 జూన్ 2020న తిరిగి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.