Hi Laila Telugu Song Lyrics సురేష్ బనిసెట్టి అందించగా, ద ఫాంటాసియా మెన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సంగీత వీడియో పాటను అదితి భావరాజు మరియు సింగర్ డి ఆలపించడం జరిగింది.
Hi Laila Telugu Song Credits
Director | Ken Royson |
Producer | SD Chada |
Singers | Aditi Bhavaraju, Singer D |
Music | The Fantasia Men |
Lyrics | Suresh Banisetti |
Star Cast | Nikhil Thomas, Varsha DSouza |
Song Label & Source | Sony Music South |
Hi Laila Telugu Song Lyrics
ఏంటీ ఈ వేళా… ఏమి చేసా ఓ లైలా
ఏంటో ఈ గోలా… ఉండలేవా నీలా
అరెరె ఆ మాట అనక… మోమాట పడక
ఏంటంత అలక నీకూ…
కంట్లోన నలకయి విసిగించకా
వేషాలు వేయొద్దికా……
పడి పడి తిట్టినా
పడనని చెప్పినా
పిలుపులో ప్రేమనే వింటున్నా
చిటపట తుళ్ళినా
చకచక వెళ్ళినా
చిలిపిగా నీడలా రానా…
టకటక వచ్చినా
తరుముతు గిచ్చినా
తడబడి పోనులే అంటున్నా…
తికమక తెంచినా
తనువుని తెచ్చినా
తెలివిగా దాటుకొని పోనా…
ప్రేమంటేనే ఒక మాయని అంటారులే
విని విని విని కాదనుకున్నానే
వాళ్ళెవ్వరో ఏదేదో అన్నారనీ
నా ప్రేమని పక్కనెట్టి వెళ్ళిపోడం
ఎమన్నా బాగుందా?
అణువంతైనా అనుమానమే
ఇంకొద్దులేవే…
అరచేతిలో పాపాయిలా
నిను చూసుకుంటానులే
పడి పడి తిట్టినా
పడనని చెప్పినా
పిలుపులో ప్రేమనే వింటున్నా
చిటపట తుళ్ళినా
చకచక వెళ్ళినా
చిలిపిగా నీడలా రానా…
టకటక వచ్చినా
తరుముతు గిచ్చినా
తమరిని తిట్టను ఇకపైనా
తికమక తెంచినా
తనువుని తెచ్చినా
తరగని ప్రేమ అనుకోనా…