Homecoming Telugu Lyrics – The Ayodhya Anthem

Homecoming Telugu Lyrics
Pic Credit: Sony Music South (YouTube)

Homecoming Telugu Lyrics (The Ayodhya Anthem), penned by Ramajogayya Sastry, music composed by Darbuka Siva, and sung by Darbuka Siva, Sathyaprakash, Pavithra Chari, Malavika Rajhesh.

Homecoming Telugu Song Lyrics

Director Dr Nagaraj V
Producers Oh My God Pictures
Singers Darbuka Siva, Sathyaprakash, Pavithra Chari, Malavika Rajhesh
Music Darbuka Siva
Lyrics Ramajogayya Sastry
Song Label & Source

Homecoming Telugu Lyrics

Ramanamamu Ramanamamu
Ramyamainadi Ramanamamu
Ramanamamu Raja Mantramu
Kalugajeyunu Punya Bhaagamu

Rama Paadamu Ramapadamu
Bhavyamainadi Ramapadamu
Ramapadhamu Sparshamaatramu
Velliviriyunu Shanti Soukhyamu

Ramalalla Manaku Jeevamu
Ramalalla Manaku Pranamu
Ramalalla Manaku Sonthamu
Ramalalla Manaku Sarwamu

Ramalalla Manaku Snehamu
Ramalalla Prema Bhaavamu
Ramalalla Mana Kutumbamu
Ramalalla Bandhuvargamu

Ramalalla Manaku Deepamu
Ramalalla Manaku Maargamu
Ramalalla Manaku Gamyamu
Ramalalla Manaku Mokshamu
Ramalalla Manaku Daivamu
Ramalalla Manaku Dhairyamu

Nindu Gundelatho
Nee Raakaku Suswaagathamu
Veyi Kannulatho Velugainadi Deekshavratam
Neehu Sthaanamulo Ninu
Niluputenthati Sukrutham
Poorva Vibhavamutho
Ninu Koluchute Maa Abhimatham

Baala Ramayya
Mamu Yela Raavayyaa
Bahu Sanaathana Hindu Dharaniki
Bhaagya Rekhavu Neevayyaa

Janmabhoomiki Swaagatham
Dharma Bhoomiki Swagatham
Raavaya Sriramachandra
Nee Ayodhyaku Swaagatham

Janmabhoomiki Swaagatham
Dharma Bhoomiki Swagatham
Raavaya Sriramachandra
Nee Ayodhyaku Swaagatham
(Ramalalla)

Suryavamshamadi
Ninnaapagaladhaa Thimiramu
Shourya Dehamadhi
Digwijayame Nee Samaramu
EnthaVaaralanu
Baadhinchunani Avarodhamu
Needhu Avatharanam
Bodhinche Jeevanasaaramu

Ee Yugamuna Neekidi
Maroka Vanavaasam
Idhu Vandhala Endlakadhi
Vaidholagi Panchenu Paravasham

Janmabhoomiki Swaagatham
Dharma Bhoomiki Swagatham
Raavaya Sriramachandra
Nee Ayodhyaku Swaagatham

Watch రామ నీ రాకకు సుస్వాగతము Video Song

Homecoming Song Lyrics in Telugu

రామనామము రామనామము
రమ్యమైనది రామనామము
రామనామము రాజ మంత్రము
కలుగజేయును పుణ్య భాగము

రామపాదము రామపాదము
భవ్యమైనది రామపాదము
రామపాదము స్పర్శమాత్రము
వెల్లివిరియును శాంతి సౌఖ్యము

రామలల్లా మనకు జీవము
రామలల్లా మనకు ప్రాణము
రామలల్లా మనకు సొంతము
రామలల్లా మనకు సర్వము

రామలల్లా మనకు స్నేహము
రామలల్లా ప్రేమ భావము
రామలల్లా మన కుటుంబము
రామలల్లా బంధువర్గము

రామలల్లా మనకు దీపము
రామలల్లా మనకు మార్గము
రామలల్లా మనకు గమ్యము
రామలల్లా మనకు మోక్షము
రామలల్లా మనకు దైవము
రామలల్లా మనకు ధైర్యము

నిండు గుండెలతో నీ రాకకు సుస్వాగతము
వేయి కన్నులతో వెలుగైనది దీక్షావ్రతం
నీదు స్థానములో నిను నిలుపుటెంతటి సుకృతం
పూర్వ విభవముతో నిను కొలుచుటే మా అభిమతం

బాల రామయ్యా
మము ఏల రావయ్యా
బహుసనాతన హిందు ధరణికి
భాగ్యరేఖవు నీవయ్యా

జన్మభూమికి స్వాగతం
ధర్మ భూమికి స్వాగతం
రావయా శ్రీరామచంద్ర
నీ అయోధ్యకు స్వాగతం

జన్మభూమికి స్వాగతం
ధర్మ భూమికి స్వాగతం
రావయా శ్రీరామచంద్ర
నీ అయోధ్యకు స్వాగతం
(రామలల్లా)

సూర్యవంశమది నిన్నాపగలదా తిమిరము
శౌర్య దేహమది దిగ్విజయమే నీ సమరము
ఎంతవారలను బాధించునని అవరోధము
నీదు అవతరణం బోధించే జీవనసారము

ఈ యుగమున నీకిది మరొక వనవాసం
ఐదు వందలఎండ్లకది
వైదొలగి పంచెను పరవశం

జన్మభూమికి స్వాగతం
ధర్మ భూమికి స్వాగతం
రావయా శ్రీరామచంద్ర
నీ అయోధ్యకు స్వాగతం

జన్మభూమికి స్వాగతం
ధర్మ భూమికి స్వాగతం
రావయా శ్రీరామచంద్ర
నీ అయోధ్యకు స్వాగతం