టీఆర్ఎస్ మొదటిసారి తెలంగాణలోని హుజుర్‌నగర్ శాసనసభ స్థానాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతిపై
43,284 ఓట్ల మెజార్టీతో తెరాస అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి విజయ దుందుభి మోగించారు.
మొత్తం 2,00,754 ఓట్లు పోలవగా తెరాసకు 1,12,796 ఓట్లు, కాంగ్రెస్‌కు 69,563 ఓట్లు, బీజేపీకి 2621 ఓట్లు, టీడీపీకి
1827 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి సుమన్‌కు 2693 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 28 మంది అభ్యర్థులు ఈ హుజుర్‌నగర్ శాసనసభకు పోటీచేశారు.
హుజుర్‌నగర్ ఉప ఎన్నిక 2019 – రౌండ్ల వారిగా టీఆర్ఎస్ ఆధిక్యత వివరాలు
ఇక రౌండ్ల వారిగా టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఆధిక్యతలు ఒకసారి పరిశీలించుకుందాం. మొదటి రౌండ్ నుండి ఆధిక్యత కనబరిచిన టీఆర్ఎస్ మొత్తం 22 రౌండ్లలో అదే ఆధిక్యత కొనసాగించింది.
రౌండ్ | ఆధిక్యం (ఓట్లు) |
1 | 2467 |
2 | 4000 |
3 | 6750 |
4 | 9356 |
5 | 11000 |
6 | 12767 |
7 | 14300 |
8 | 17687 |
9 | 19356 |
10 | 21618 |
11 | 22000 |
12 | 23828 |
13 | 25366 |
14 | 26999 |
15 | 29967 |
16 | 32256 |
17 | 34506 |
18 | 36112 |
19 | 38344 |
20 | 40547 |
21 | 42484 |
22 | 43284 |