హైదరాబాద్ మిధానిలో అప్రెంటీస్ పోస్టుల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 104 ఖాళీల కోసం 19 మార్చి 2020 నుండి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. పూర్తి వివరాల నోటిఫికేషన్ ద్వారా తెలుసుకొని అప్లై చేసుకొనగలరు.
Hyderabad Midhani Jobs – హైదరాబాద్ మిధానిలో 104 అప్రెంటీస్ పోస్టుల భర్తీ
కాంచన్‌బాగ్‌లోని మిశ్ర దత్తు నిగమ్ లిమిటెడ్ గ్రాడ్యుయేట్/డిప్లొమా/ట్రేడ్ అప్రెంటీస్ లో మొత్తంగా 104 ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందుకోసం ముందుగా అభ్యర్థులు రెజిస్టరుచేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలో కింద లింకులు సమకూర్చడం జరిగింది.
గ్రాడ్యుయేట్ మరియు డిప్లొమా అప్రెంటీస్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు https://www.mhrdnats.gov.in/ ఈ వెబ్‌సైట్‌లో, ట్రేడ్ అప్రెంటీస్ కొరకు https://www.apprenticeship.gov.in/ ఈ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.
ఖాళీల వివరాలు
- జీఏటి – 14
- టిఏటి – 10
- ట్రేడ్ అప్రెంటిస్ – 80 (వెల్డర్- 25, ఫిట్టర్- 10, టర్నర్- 10, ఎలక్ట్రీషియన్- 25, మెషినిస్ట్- 10)
ఇంటర్వ్యూ తేదీలు
- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ – 2020 మార్చి 19
- డిప్లొమా అప్రెంటీస్ – 2020 మార్చి 20
- ట్రేడ్ అప్రెంటీస్ – 2020 మార్చి 21
ఇంటర్వ్యూలు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు నిర్వహిస్తారు. కావున అభ్యర్థులు అన్ని రకాల సర్టిఫికెట్లు తీసుకొని కింద ఇవ్వబడిన అడ్రస్ కు వెళ్ళగలరు.
ఇంటర్వ్యూ స్థలం: Auditorium, Corporate Hostel Building, MIDHANI, Hyderabad.
పూర్తి వివరాల కొరకు మిధాని అధికారిక వెబ్ సైట్ లోని కెరీర్ పేజీ సందర్శించగలరు. https://midhani-india.in/