ఇద్దరి లోకం ఒకటే ట్రైలర్ విడుదల: ప్రేమ, భావోద్వేగాల కలయిక

'ఇద్దరి లోకం ఒకటే' ట్రైలర్

‘ఇద్దరి లోకం ఒకటే’ ట్రైలర్ ను నిర్మాత దిల్ రాజు ఈరోజు విడుదల చేశారు. రాజ్ తరుణ్, షాలినీ పాండే హీరోహీరోయిన్లుగా
నటిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు ముగించుకొని డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘ఉయ్యాల జంపాల’ సినిమాతో తెరంగేట్రం చేసిన రాజ్ తరుణ్, ‘అర్జున్ రెడ్డి’ భామ షాలినీ పాండే మొదటి సారి నటిస్తున్న ‘ఇద్దరి
లోకం ఒకటే’ ట్రైలర్ చూస్తుంటే ప్రేమ, భావోద్వేగాల కలయికలా కనిపిస్తుంది.

‘పరిచయం, స్నేహం ఇవన్నీ కో-ఇన్సిడెంట్స్. ప్రేమించట్లేదంటే నువ్వు నచ్చలేదని కాదు. నీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేసేంత ఫీలింగ్ లేదని’ అని షాలినీ చెప్పే డైలాగ్ మరియు ‘ఒక మనిషి కావాలి అనుకోవడానికి బయటికి కనిపించే ఒక్క ఫీలింగ్ సరిపోతుంది. కానీ, వద్దు అనుకోవడానికి బయటికి కనిపించని వంద కారణాలు కావాలి’ అంటూ రాజ్ తరుణ్ భాదపడుతూ చెప్పే డైలాగ్స్ సినిమా మీద ఆసక్తి రేపుతుంది.

ట్రైలర్ చివర్లో ‘గీతాంజలి’ చిత్రంలోని ‘ఓం నమహా పాట’లో నాగార్జున, గిరిజ ముద్దు పెట్టుకున్న సీన్‌ తో ముగుస్తుంది.

మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి జి.ఆర్‌.కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

‘ఇద్దరి లోకం ఒకటే’ ట్రైలర్ మీరూ చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


The reCAPTCHA verification period has expired. Please reload the page.