Jaalileni Devuda Part 2 Song Lyrics penned by Ashok Kumar & Suresh Kadari, music composed by Madeen SK, and sung by Hanumanth Yadav & Divya Malika. Telugu love failure folk song.

Jaalileni Devuda Part 2 Song Credits

Lyrics Ashok Kumar & Suresh Kadari
Music Madeen Sk
Singers Hanumanthu Yadav and Divya Malika
Song Label Ashok tunes

Jaalileni Devuda Part 2 Song Lyrics

Polimera Poshamma Sakshiga
Mana Prema Mantallo Kaaluthundira
Gadimeeda Gundraayi Anchuku
Neeperu Naaperu Maasipaayeraa

Oorantha Edsetattu
Mana Prema Kanneella Katha Aayenu
Kaatilo Kattelu Kooda Ninu Joosi
Kanneellu Peduthunnayi

Ninnu Nannu Kalpinolle
Ennupote Podsi Pothunnaru
Sooreedu Podseloga
Kanneelle Migilchi Pothiniraa

Jaali Leni Devuda, EnthaPani Jetthiviraa
Praanamaina Premane Naa Nundi Etthukupotivira
Paapakaari evuda Orvalekapothivira
Ontarini Jesi Nannu Naathodu Teesukapothivira

Etta Nenu Undedhi Seppara Devara
Emi Paapamu Neeku Jesinaanura
Endukintha Badha Naaku Joopinaavura
Puttagaane Puritilona Sampapothiviraa

Polimera Poshamma Sakshiga
Mana Prema Mantallo Kaaluthundira
Gadimeeda Gundraayi Anchuku
Neeperu Naaperu Maasipaayeraa

Neethone Noorellu Undaalani
Kalalenno Ne Gantini
Kadupulo Vetti Kannathallole
Soodaali Anukuntini

Adugulo Adugai
Neetho Undaalani Anukuntini
Nee Seyyi Pattuku Ye Kattamaina
Daatudaamanukontini

Kalalanni Nippullo Kaali
Boodidhe Ayyenu
Aashalanni Aakaashamlo
Seekati Paalayyenu

Navvule Sedhiripoyi
Kanneelle Migilenu
Moyaleni Badhallo
Nanne Tosenu

Etta Nenu Undedhi Seppara Devara
Emi Paapamu Neeku Jesinaanura
Endukintha Badha Naaku Joopinaavura
Puttagaane Puritilona Sampapothiviraa

Ye Paadu Kanno Manapaina Badi
Kaksha Penchukkadho
Leka Aa Brahma Devudu
Naa Nudutiraatha Ittane Raasinaado

Ye Janmalo Nenu Chesina Paapamo
Nannu Juttukunnadho
Eenaadu Ninnitta Dhooram Jesi
Nannu Samputhunnadho

Kaatilo Kaale Mundhu Nanne Joosipove
Kallaloni Kanneeru Aapaga Nuvve Iraave
Mattolina Galse Mundhu Malli Vachhinaapove
Nannugooda Neethopaatu Teesukonellipove
Nannugooda Neethopaatu Teesukonellipove

పొలిమేర పోషమ్మ సాక్షిగా
మన ప్రేమ మంటల్లో కాలుతుందిరా
గడిమీది గుండ్రాయి అంచుకు
నీపేరు నాపేరు మాసిపాయెరా

ఊరంత ఏడ్సేటట్టు
మన ప్రేమ కన్నీళ్ల కథ ఆయెను
కాటిలో కట్టెలు కూడా నిను జూసి
కన్నీళ్లు పెడుతున్నయి

నిన్ను నన్ను కల్పినోళ్లే
ఎన్నుపోటే పొడ్సి పోతున్నరు
సూరీడు పోడ్సేలోగా
కన్నీళ్ళే మిగిల్చి పోతినిరా

జాలి లేని దేవుడా, ఎంత పని జేత్తివిరా
ప్రాణమైన ప్రేమనే నా నుండి ఎత్తుకపోతివిరా
పాపకారి దేవుడా ఓర్వలేకపోతివిరా
ఒంటరిని జేసి నన్ను నాతోడు తీసుకపోతివిరా

ఎట్ట నేను ఉండేది… సెప్పర దేవరా
ఏమి పాపము నీకు జేసినానురా
ఎందుకింత బాధ నాకు జూపినావురా
పుట్టగానే పురిటిలోన సంపపోతివిరా

పొలిమేర పోషమ్మ సాక్షిగా
మన ప్రేమ మంటల్లో కాలుతుందిరా
గడిమీది గుండ్రాయి అంచుకు
నీపేరు నాపేరు మాసిపాయెరా

నీతోనే నూరేళ్లు ఉండాలని
కలలెన్నో నే గంటిని
కడుపులో వెట్టి కన్నతల్లోలే
సూడాలి అనుకుంటిని

అడుగులో అడుగై నీతో
ఉండాలని అనుకుంటిని
నీ సెయ్యి పట్టుకు ఏ కట్టమైనా
దాటుదామనుకొంటిని

కలలన్నీ నిప్పుల్లో కాలి
బూడిదే అయ్యెను
ఆశలన్నీ ఆకాశంలో
సీకటి పాలయ్యెను

నవ్వులే సెదిరిపోయి కన్నీళ్ళే మిగిలెను
మోయలేని బాధల్లో నన్నే తోసెను

ఎట్ట నేను ఉండేది… సెప్పర దేవరా
ఏమి పాపము నీకు జేసినానురా
ఎందుకింత బాధ నాకు జూపినావురా
పుట్టగానే పురిటిలోన సంపపోతివిరా

ఏ పాడు కన్నో మనపైన బడి
కక్ష పెంచుకున్నదో
లేక ఆ బ్రహ్మ దేవుడు
నా నుదుటిరాత ఇట్టనే రాసినాడో

ఏ జన్మలో నేను చేసిన పాపమో
నన్ను జుట్టుకున్నదో
ఈనాడు నిన్నిట్ట దూరం జేసి
నన్ను సంపుతున్నదో

కాటిలో కాలే ముందు నన్నే జూసి పోవే
కళ్ళలోని కన్నీరు ఆపగ నువ్వే ఐరావే
మట్టిలోన గల్సే ముందు మళ్ళీ వచ్చిపోవే
నన్నుగూడ నీతోపాటు తీసుకొనెల్లిపోవే
నన్నుగూడ నీతోపాటు తీసుకొనెల్లిపోవే

Watch జాలి లేని దేవుడా Video Song