Home » Lyrics - Telugu » Janaku Janaku Bathukamma Song Lyrics – Telu Vijaya

Janaku Janaku Bathukamma Song Lyrics – Telu Vijaya

by Devender

Janaku Janaku Bathukamma Song Lyrics. తేలు విజయ గారు పాడిన ఈ బతుకమ్మ పాట లిరిక్స్ మీకోసం.

Janaku Janaku Bathukamma Song Credits

Song Category Bathukamma Song
Lyrics Bathukamma Lyrics
Singer Telu Vijaya
Music Lable

Janaku Janaku Bathukamma Song Lyrics In English

Janaku Janakunintla Uyyalo
Sathya Janakunintla Uyyaalo
Puttindi Seethamma Uyyaalo
Poorude Korindhi Uyyaalo

Perigindi Seethamma Uyyaalo
Perugannamu Thini Uyyalo
China Chinna Bomarillu Uyyalo
Katta Nerchindhamma Uyyaalo

Chinna Bommala Pendli Uyyalo
Cheyya Nerchindhamma Uyyalo
Peda Pedda Bomarillu Uyyalo
Katta Nerchindhamma Uyyaalo

Pedda Bommala Pendli Uyyaalo
Cheyya Nerchindhamma Uyyaalo
Lakkari Kolalu Uyyaalo
Dhancha Nerchindhamma Uyyaalo

Sing జనకు జనకునింట్ల Bathukamma Song


Janaku Janaku Bathukamma Song Lyrics In Telugu

జనకు జనకునింట్ల ఉయ్యాలో
సత్య జనకునింట్ల ఉయ్యాలో
పుట్టింది సీతమ్మ ఉయ్యాలో
పూరుడె కోరింది ఉయ్యాలో

పెరిగింది సీతమ్మ ఉయ్యాలో
పెరుగన్నము తిని ఉయ్యాలో
చిన చిన్న బొమరిల్లు ఉయ్యాలో
కట్టనేర్చిందమ్మ ఉయ్యాలో

చిన్న బొమ్మల పెండ్లి ఉయ్యాలో
చెయ్య నేర్చిందమ్మ ఉయ్యాలో
పెద పెద్ద బొమరిల్లు ఉయ్యాలో
కట్టనేర్చిందమ్మ ఉయ్యాలో

పెద్ద బొమ్మల పెండ్లి ఉయ్యాలో
చెయ్య నేర్చిందమ్మ ఉయ్యాలో
లక్కరి కోలలు ఉయ్యాలో
దంచ నేర్చిందమ్మ ఉయ్యాలో

వెండియీ మోంటెల్ల ఉయ్యాలో
చెరగ నేర్చిందమ్మ ఉయ్యాలో
పౌడియ జల్లెల్ల ఉయ్యాలో
పట్ట నేర్చిందమ్మ ఉయ్యాలో

పెరుగుతూ ఆ సీత ఉయ్యాలో
పెండ్లి కోరిందమ్మ ఉయ్యాలో
తూర్పు రాజులమ్మ ఉయ్యాలో
సీతానడిగి వచ్చిరి ఉయ్యాలో
విల్లు విరిచిన వారికుయ్యాలో
మా సీతనిస్తాము ఉయ్యాలో
విల్లు విరవలేక ఉయ్యాలో
వారెళ్లిపోయిరి ఉయ్యాలో

పడమటి రాజులు ఉయ్యాలో
సీతనడుగొచ్చిరి ఉయ్యాలో
విల్లు విరిచిన వారికుయ్యాలో
మా సీతనిస్తాము ఉయ్యాలో
విల్లు విరవలేక ఉయ్యాలో
వారెళ్లిపోయిరి ఉయ్యాలో

దక్షణపు రాజులు ఉయ్యాలో
సీతనడిగినారు ఉయ్యాలో
విల్లు విరిచిన వారికుయ్యాలో
మా సీతనిస్తాము ఉయ్యాలో
విల్లు విరవలేక ఉయ్యాలో
వారెళ్లిపోయిరి ఉయ్యాలో

ఉత్తర దేశన ఉయ్యాలో
అయోధ్యనేలేటి ఉయ్యాలో
రాఘవంశ రాజులు ఉయ్యాలో
దశరథ తనయులు ఉయ్యాలో

రామలక్ష్మణులమ్మ ఉయ్యాలో
సీతానడిగి వచ్చిరి ఉయ్యాలో
విల్లు విరిచిన వారికుయ్యాలో
మా సీతనిస్తాము ఉయ్యాలో
విల్లు విరవలేక ఉయ్యాలో
వారెళ్లిపోయిరి ఉయ్యాలో

ఇంతలో రామయ్య ఉయ్యాలో
విల్లు సేతబట్టి ఉయ్యాలో
పటపట విలిరిసి ఉయ్యాలో
పడతినే పెండ్లాడే ఉయ్యాలో
శివధనస్సు విరిసి ఉయ్యాలో
సీతనే పెండ్లాడే ఉయ్యాలో

పెండ్లి వేడుకలన్నీ ఉయ్యాలో
జరిపించే జనకుడు ఉయ్యాలో
కాత మామిడి కింద ఉయ్యాలో
కాళ్ళను కడిగించే ఉయ్యాలో
పూత మామిడి కింద ఉయ్యాలో
పుస్తెనే కట్టించే ఉయ్యాలో
ముత్యాల తలంబ్రాలు ఉయ్యాలో
మురిపెంగ పోయించే ఉయ్యాలో

పెరుగన్నము పెట్టి ఉయ్యాలో
పెంచుకో రామయ్య ఉయ్యాలో
నెయ్యన్నము పెట్టి ఉయ్యాలో
నేర్పుకో రామయ్య ఉయ్యాలో
సద్దన్నము పెట్టి ఉయ్యాలో
సాదుకో రామయ్య ఉయ్యాలో

ముక్కోటి దేవుళ్ళు ఉయ్యాలో
మక్కువతో దీవించే ఉయ్యాలో
బంగారు రథమెక్కి ఉయ్యాలో
బైలిల్లి పోయిరి ఉయ్యాలో
పయనమై పోయిరి ఉయ్యాలో
పట్టాభిషేకానికి ఉయ్యాలో

పయనమై పోయిరి ఉయ్యాలో
పట్టాభిషేకానికి ఉయ్యాలో
పయనమై పోయిరి ఉయ్యాలో
పట్టాభిషేకానికి ఉయ్యాలో

పయనమై పోయిరి ఉయ్యాలో
పట్టాభిషేకానికి ఉయ్యాలో
పయనమై పోయిరి ఉయ్యాలో
పట్టాభిషేకానికుయ్యాలో

You may also like

Leave a Comment