Janata Curfew CM KCR Press Meet. మార్చి 22, 2020న జనతా కర్ఫ్యూ దృష్ట్యా సీఎం కెసిఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందుకు ప్రజల మద్దతు కావాలి అని కోరారు.
తెలంగాణాలో 24 గంటల జనతా కర్ఫ్యూ
ఇప్పటి వరకు తెలంగాణాలో 21 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు
విదేశాల నుండి వచ్చిన వారికి దండం పెట్టి చెప్తున్న – రిపోర్టు చేయండి
రోడ్లమీదకు ఒక్క బస్సు కూడా రాదు
రేపు సాయంత్రం 5గం.లకు సైరన్ మోగుతుంది
డాక్టర్లను కాపాడుకుందాం
Janata Curfew CM KCR Press Meet
22 మార్చి ఉదయం 6 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు జనతా కర్ఫ్యూ లో విధిగా ప్రతీ ఒక్కరు పాల్గొని తెలంగాణా సమాజం దేశానికి ఆదర్శంగా నిలవాలని తెలంగాణా సమాజానికి పిలుపునిచ్చారు సీఎం కెసిఆర్.
విదేశాల నుండి తెలంగాణ రాష్ట్రంలోకి దాదాపు 20 వేల మంది పౌరులు వచ్చారు. ఇప్పటి వరకు 11 వేల మందిని ట్రేస్ చేసి ఆధీనంలోకి తీసుకున్నాము. 5,274 నిఘా బృందాలు వారికి కావలసిన అన్ని సౌకర్యాలు చూసుకుంటున్నారు. 700 మంది అనుమానితులను పరీక్షలు జరుగుతున్నాయి. ఇప్పటి తెలంగాణ రాష్ట్రంలో 21 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందరూ బయటి దేశాల నుండి వచ్చినవారే.
అంతరాష్ట్ర సరిహద్దుల్లో 52 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వచ్చే వాళ్ళను పరీక్షిస్తున్నాము. అలాగే 78 జాయింట్ టీమ్స్ కూడా మోహరించడం జరిగింది.
విదేశాల నుండి వచ్చిన వారు మా బిడ్డలే. మీరు నిర్లక్ష్యంగా ఉంటూ బయట ఉండడం తగదు. ఇలా అయితే మీరు మీ కుటుంబంతో సమాజాన్ని చెడగొట్టిన వారు అవుతారు. మీరు ప్రభుత్వం చెప్పినట్టు వినాలి, సమాజహితం కోరి మీకు మీరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెప్పాలి. మీరు పారి పోవడం ఏంటి? ఒకతను పారిపోతుంటే ఆలేరు దగ్గర మరియు ఇంకో ఇద్దరు ఢిల్లీకి పోతుంటే కాజిపేటలో పట్టుకొని గాంధీ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో మీరు పారిపోవడం మేము తీసుకురావడం మంచిది కాదు. తప్పకుండ స్వీయ నియంత్రణ ఉండాలి. మీకు దండం పెట్టి అప్పీల్ చేస్తున్న.. తప్పకుండ పోలీసులకో, డాక్టర్లకు చెప్పండి. వైద్య పరీక్షలు చేస్తాము తప్ప అరెస్ట్ చేస్తామా? మానవజాతి క్షేమం ఆలోచించి మసలుకోవాలి. వారి కుటుంబ సభ్యులు కూడా ముందుకు రావాలి.
జలుబు, దగ్గు, శ్వాస ఇబ్బందులు ఉంటె వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. ముఖ్యంగా 60 సంవత్సరాలు దాటిన వారు అలాగే 10 సంవత్సరాలు లోపు పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దు.
మోడీ గారు జనతా కర్ఫ్యూ ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు పాటించమని చెప్పారు. కానీ మనం ఉదయం ఉదయం 6 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల (24 గంటలు) వరకు ఈ కర్ఫ్యూ లో పాల్గొని తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలవాలి.
ఒక్క ఆర్టీసీ బస్సు కూడా నడవదు. డిపోకు 5 బస్సులు సిద్ధంగా ఉంచాము. ఏమైనా అత్యవసర పరిస్థితులు ఉంటె వాడుకోవడం కోసం మాత్రమే ఆ బస్సులు. వేరే ఏ రాష్ట్రాల బస్సులు కూడా రాష్ట్రంలోకి అనుమతించం. మెట్రో రైళ్లు కూడా నడపడం జరగదు. వర్తక వ్యాపార సంఘాలు అన్నీ మూసివేయాలి. బయటికి వెళ్లాల్సి వస్తే ఒక మీటర్ దూరంలోఉండండి. స్వీయ నియంత్రణే కరోనా వ్యాప్తికి కట్టడి.
కరోనా వైరస్ మీద కెసిఆర్ జోక్
కరోనా వైరస్ బాగా స్వాభిమానం ఉన్న జబ్బు. అది ఉన్న దగ్గరే ఉంటది, మనం ఆహ్వానిస్తేనే తప్ప అది రాదు. ఆ జబ్బును ఇంటికి పిలుద్దామా వద్దా అనేది మన చేతుల్లో ఉంది. కాబట్టి ప్రభుత్వం ఎంత చెప్పినా ప్రజల సహకారం చాలా అవసరం. అవసరమైతే అన్నీ రద్దు చేసి ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము.
అందరికంటే ముందు మనం కాపాడుకోవాల్సింది మన వైద్య సిబ్బందిని. వారికి అందరి తరపున ధన్యవాదాలు. వైద్యుల ఆరోగ్యం చాలా ముఖ్యం. వారికి వ్యాధి సోకితే ఇంకా మన పని ఖతం. వేరే ఎక్కడినుండో వచ్చి వైద్యం చేయడానికి ఎవరూ ముందుకురారు. కాబట్టి, వారికి కావాల్సిన సామాగ్రి అంత తెప్పించాము. ఇంకా తెప్పిస్తాము. వేల కోట్లు ఖర్చుచేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కావాల్సిందల్లా రేపు ప్రజల సహకారం.
ప్రధాన మంత్రి గారు రేపు సాయంత్రం చప్పట్లు కొట్టి ఐక్యతను చాటామని చెప్తే సోషల్ మీడియాలో కొందరు మూర్కులు పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తున్నారు. అలా ఎవరైనా చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డీజీపీ గారిని ఆదేశించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సాయంత్రం 5 గంటలకు సైరన్ మోగిస్తుంది. ప్రతీ ఒక్కరు ఇంటి ముందుకు వచ్చి రెండు నిమిషాలు చప్పట్లు కొట్టి జాతి ఐక్యతను చాటాలి.
Also Read: FIR Booked – Kanika Kapoor