మెగాస్టార్ చిరంజీవితో రెండోసారి నటించే అవకాశాన్ని దక్కించుంది కాజల్ అగర్వాల్. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘ఖైదీ నంబర్ 150’ అని తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడుగా తెరకెక్కుతున్న ‘ఆచార్య’ చిత్రం నుండి తప్పుకుంటున్నట్టు నటి త్రిష సోషల్ మీడియా వేదికగా తెలిపింది.
Kajal Aggarwal To Pair Up With Chiranjeevi Again
త్రిష స్థానంలో అనుష్క తో పాటు మరికొందరి పేరు వినిపించినా చివరికి చిత్ర బృందం కాజల్ ను ఖరారు చేసినట్టు తెలుస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఈ సినిమా షూటింగ్ నిలిపేస్తున్నటు చిరంజీవి ప్రకటించారు. వచ్చే నెలలో కాజల్ చిత్ర యూనిట్ తో జాయిన్ కానుంది.
అయితే రామ్ చరణ్ ఈ చిత్రంలో నటిస్తున్నారా లేదా అనే అంశం మీద కూడా చిత్ర బృందం స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. మహేబాబు నటిస్తున్నారు అని అనుకున్నా చివరికి మల్లి చెర్రీ నే ఫైనల్ చేశారని ఫిల్మ్ వర్గాల సమాచారం. రామ్ చరణ్ సరసన నటించే కథానాయిక కోసం కసరత్తు జరుగుతుంది.
ఇప్పటికే రెజీనా ప్రత్యేక గీతంలో నటించనుంది. సోను సూద్, సంపత్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి ప్రభుత్వ ఉద్యోగిగా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
ప్రస్తుతానికి కాజల్ భారతీయుడు-2 లో కమల్ హాసన్ సరసన మరియు బాలీవుడ్ చిత్రంలో జాన్ అబ్రహాంకు జోడిగా నటిస్తుంది.