Karthikeya 2 Teaser – Daivam Manushya Rupena!

Karthikeya 2 Teaser

Karthikeya 2 Teaser: ‘కలియుగే ప్రథమ పాదే, జంబూద్వీపే, భరత వర్షే, భరత ఖండే.. 5118 ఏళ్ల క్రితం ముగిసిన ఒక యుగం.. ఆ యుగ అనంత జ్ఞాన సంపద, అందులో దాగి ఉన్న ఒక రహస్యం… ఈ యుగంలో అన్వేషణ, స్వార్థానికి
ఒకరు, సాధించడానికి ఒకరు… అతని సంకల్పానికి సాయం చేసినవారెవరు’ అంటూ మొదలైన టీజర్ చాలా ఆసక్తికరంగా ‘కార్తికేయ 2’ ఉంది.

కృష్ణుడి కాలి బ్రొటన వేలికి ముసలం గుచ్చుకుంటున్నట్టు చూపించడం, ‘దైవం మనుష్య రూపేణా’ అనే స్లైడ్ వేయడం, నిఖిల్ చేతిలో ఒక కాగడా పట్టుకొని చివర్లో నించోవడం, వెరసి ఈరోజు విడుదల చేసిన ‘కార్తికేయ 2’ కాన్సెప్ట్ వీడియో డివోషనల్ టచ్ లో రూపొందించాడు దర్శకుడు.

వీడియో ఆధ్యాంతం బొమ్మలతో చూపిస్తూ వాయిస్ ఓవర్ ఇస్తూ తీసిన విధానం ‘కార్తికేయ’ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. ఇక
వీడియో చివర్లో ‘చైత్రంలో చిత్రీకరణ’ చందు మొండేటి ఒక్క ఆంగ్ల అక్షరం ఎక్కడా కనిపించకుండా ముగించారు.

నిఖిల్ హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సమర్పణలో టిజి విశ్వ ప్రసాద్ & అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించారు. వివేక్ కుచిభోట్ల సహ-నిర్మాత మరియు కాల భైరవ సంగీతం అందించారు.

Karthikeya 2 Teaser – Concept Video

Also Read: Today Gold Price in Hyd

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *