Today Gold Rate in Hyderabad 22 Carat & 24 Carat. ఈరోజు బంగారం ధర హైదరాబాద్ లో.

Rs. 48,780 ( 24 Carat, 10 grams ) Wednes

Rs. 44,680 ( 22 Carat, 10 grams ) Wednes

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఈరోజు హైదరాబాద్ లో రూ.48,780 మరియు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,680 గా ఉంది.

హైదరాబాద్‌లో బంగారం ధర గత కొన్నేళ్లుగా హెచ్చుతగ్గులను గమనిస్తున్నాము. బంగారం ధర పెరుగుతున్నప్పటికీ ఈ మెట్రోపాలిటన్ నగరంలో బంగారం డిమాండ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల హాల్‌మార్క్ బంగారం రేటు అంతర్జాతీయ మార్కెట్ లకు అనుగుణంగా మారుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో బంగారం మీద పెట్టుబడులు బాగానే పెరుగుతుండడం మరియు వ్యక్తిగతంగా బంగారం కొనే వాళ్ళు పెరుగుతుండడంతో  బంగారం బిజినెస్ కు ఊతమిస్తుంది.

స్థిర ఆదాయ సెక్యూరిటీలు మరియు ఈక్విటీలు మినహాయిస్తే బంగారం మీద పెట్టుబడి పెట్టడం మంచిదని నగర ప్రజానీకం భావిస్తుంది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ (గూడ్స్ & సర్వీసెస్ టాక్స్) అమలులోకి తీసుకొచ్చిన తరువాత, బంగారంపై 3 శాతం పన్నువిధించారు. ఇంతకుముందు రేట్లతో పోలిస్తే ఇది కొద్దిగా ఎక్కువ. బంగారు ఆభరణాలు కొనాలనుకునే వారికి జీఎస్టీ రూపేణ కొంత భారం తప్పడం లేదు.

భారతీయ రూపాయి మారకం విలువ భారీగా తగ్గడం వల్ల ఈ సంవత్సరం హైదరాబాద్ లో బంగారం రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఇందుకు అనుగుణంగానే బంగారం మీద దీర్ఘకాలిక పెట్టుబడులు పెరుగుతున్నాయి.

Today Gold Rate in Hyderabad 22 Carat & 24 Carat

బుధవారం 03, జూన్ 2020

24 క్యారెట్లు – 10 గ్రాములు ధర
ఈరోజు రూ.48,780
నిన్న రూ.49,170

 

బుధవారం 03, జూన్ 2020
22 క్యారెట్లు – 10 గ్రాములు ధర
ఈరోజు రూ.44,680
నిన్న రూ.45,070

గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో బంగారం ధరలు

తేదీ 24 క్యారెట్లు/10 గ్రాములు (స్టాండర్డ్ బంగారం) 22 క్యారెట్లు/10 గ్రాములు (స్వచ్ఛమైన బంగారం)
జూన్ 03, 2020 రూ.48,780 రూ.44,680
జూన్ 01, 2020 రూ.49,220 రూ.45,120
మే 18, 2020 రూ.48,930 రూ.45,860
మే 11, 2020 రూ.47,300 రూ.44,520
మే 01, 2020 రూ.46,200 రూ.43,410
ఏప్రిల్ 30, 2020 రూ.46,700 రూ.43,950
ఏప్రిల్ 21, 2020 రూ.44,100 రూ.40,400
ఏప్రిల్ 11, 2020 రూ.44,090 రూ.40,416
ఏప్రిల్ 01, 2020 రూ.43,080 రూ.39,440

బంగారం ధరలు ఎలా నిర్ణయిస్తారు

లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ (ఎల్బిఎంఎ) లో ప్రతీ రోజు రెండుసార్లు ఉదయం 10:30 మరియు మధ్యాహ్నం 03:00 గంటలకు బంగారు రేట్లు నిర్ణయించబడతాయి.  దీని ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా బంగారం మరియు వెండి ధరలు ట్రేడ్ చేయబడతాయి.

నిజానికి బంగారం ధరలు లండన్ ఓవర్-ది-కౌంటర్ మార్కెట్ మరియు కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్ ట్రేడింగ్ నుండి తీసుకోబడ్డాయి. లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ (ఎల్బిఎంఎ) బంగారు ధరను US డాలర్లలో IBA (ICE బెంచ్ మార్క్ అడ్మినిస్ట్రేషన్) ప్రచురిస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా బంగారు ఉత్పత్తిదారులు, వినియోగదారులు, పెట్టుబడిదారులు మరియు కేంద్ర బ్యాంకులకు ఒక ప్రమాణంగా పనిచేస్తుంది.

హైదరాబాద్ లో బంగారం ధరలు ఏ విధానంలో లెక్కకడతారు

లండన్ లోని అంతర్జాతీయ బంగారు మార్కెట్‌పై ఆధారపడి భారతదేశంలో బంగారు రేట్లు నిర్ణయిస్తారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. దేశంలో వివిధ నగరాల్లో బంగారం రేట్లు వేరుగా ఉంటాయి. అలా ధరలో మార్పులు ఎందుకు ఉంటాయో చూద్దాం.

  • కస్టమ్ డ్యూటీ
  • రవాణా ఖర్చులు
  • బులియన్/ ఆభరణాల సంఘాలు
  • రూపాయి విలువ

ఆభరణాల షోరూమ్‌లలో బంగారం ధర ఇలా లెక్కిస్తారు

హైదరాబాద్‌తో పాటు దేశంలో రోజువారీ బంగారు రేట్లను నిర్ణయించడంలో ఇండియన్ బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబిజెఎ), అపెక్స్ జ్యువలరీ మరియు బులియన్ బాడీలు కీలక పాత్ర పోషిస్థాయి.

క్రింది విధంగా లెక్కకట్టండి ధరలను.

బంగారం ధర (22/18/14 క్యారట్) x  బరువు (గ్రాములలో) + తయారీ ఖర్చులు + జిఎస్‌టి (3%) (ఆభరణాలు + తయారీ ఖర్చులు) = తుది ఆభరణం విలువ.

Read: హృదయాలను హత్తుకునేలా శర్వానంద్‌ సమంత ల ‘జాను’ ట్రైలర్‌