కీర్తి సురేష్ పుట్టినరోజు – మిస్ ఇండియా పాట టీజర్, పెంగ్విన్ పోస్టర్ మరియు నగేష్ మూవీ ఫస్ట్ లుక్ రివీల్

కీర్తి సురేష్ పుట్టినరోజు

కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా తను నటిస్తున్న పలు చిత్రాల పోస్టర్లు, సాంగ్ టీజర్ విడుదల అయ్యాయి. జాతీయ స్థాయిలో ఉత్తమ నటి కీర్తి సురేష్ గురువారం తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

‘నేను శైలజా’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత నానితో జత కట్టి ‘నేను లోకల్’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు
మరింత దగ్గరయింది. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహానటి’ చిత్రం ద్వారా
ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డు సొంతం చేసుకుంది.

కమర్షియల్ చిత్రాలతో పాటు మహిళా ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్న కీర్తి తమిళ దర్శకుడు కార్తీక్
సుబ్బరాజు దర్శకత్వంలో ‘పెంగ్విన్’ చిత్రం నటిస్తుంది. ఈరోజు ఈ చిత్ర పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో కీర్తి
సురేశ్ గర్భిణీగా దర్శనమిచ్చింది.   ఒక విధంగా ఈలాంటి పాత్ర చేయడం సాహసమనే చెప్పాలి.

తను నటిస్తున్న మరో చిత్రం ‘మిస్ ఇండియా’. నరేంద్ర నాథ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్ర బృందం కీర్తి సురేశ్ పుట్టినరోజు సాంగ్ టీజర్ ను విడుదల చేసింది.

నగేష్ కుకునూరు దర్శకత్వంలో క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న మరో చిత్రంలో పోస్టర్ ను ఈ రోజు విడుదల చేసింది చిత్ర
బృందం సోషల్ మీడియా వేదికగా. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో చిక్కిపోయిన ముద్దుగుమ్మలా అందంగా కనిపిస్తుంది. దిల్ రాజు
నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 11 నుంచి చివరి షెడ్యూల్ జరుపుకుంటుంది.